చలికాలంలో సాధారణంగానే బద్దకంగా ఉంటుంది. దీంతో ఆలస్యంగా నిద్రలేవడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి
TV9 Telugu
అంతేకాదు, బయట పడిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి మనల్ని వెచ్చగా ఉంచడానికి మన శరీరం ఎక్కువ శక్తినీ ఖర్చు చేస్తుంది
TV9 Telugu
దాంతో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందుకే మనం తినే ఆహారం మన శక్తిస్థాయుల్ని పెంచాలి. జీర్ణక్రియను మెరుగుపరిచి, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేదిగా ఉండాలి
TV9 Telugu
ఇందుకు చిలగడ దుంప మంచి ఎంపిక. దీంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చిలగడ దుంపలో విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శ్వాసకోశ గోడలకు రక్షణ కల్పించి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి
TV9 Telugu
దాంతో శీతకాలంలో వచ్చే అలసటను దూరం చేసి చురుకుగా ఉండేందుకు సహకరిస్తాయి. వాతావరణం చల్లగా ఉందని నీరు తక్కువగా తాగుతాం
TV9 Telugu
దాంతో చర్మం పొడి బారుతుంది. అయితే ఇందులో ఎక్కువగా ఉండే నీటిశాతం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురికాదు. యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు సమృద్ధిగా ఉండే చిలగడదుంప చర్మాన్ని మృదువుగా చేసి, సహజ మెరుపునిస్తుంది
TV9 Telugu
చిలగడదుంపలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను పెంచుతుంది. పేగులో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి గట్‌హెల్త్‌ను ప్రోత్సహిస్తుంది