క్విట్ అమెరికా.. భారత విద్యార్థులే టార్గెట్‌గా డొనాల్డ్ ట్రంప్ కొత్త స్లోగన్..!
పరిమితికి మించి వేగంగా బండి నడిపారా.. గతంలో ఎప్పుడైనా సిగ్నల్ క్రాస్ చేశారా.. తెలిసోతెలీకో ఎవరికైనా సిగరెట్, మద్యం బాటిల్ షేర్ చేశారా.. ఎప్పుడైనా షాపింగ్‌కి వెళ్లి బిల్లు కట్టకుండా వచ్చేశారా..? అయితే మీకు అమెరికాలో నెక్ట్స్ డే లేనట్టే..! మీ వీసా దాదాపుగా రద్దయినట్టే..! ఇవన్నీ మీ దృష్టిలో పెద్దపెద్ద నేరాలు కాకపోవచ్చు. అమెరికా చట్టాల ప్రకారం మీరు దేశద్రోహుల కిందే లెక్క..!

అసలే ఆయనకు కొంచెం తిక్క..! అదిప్పుడు పీక్స్‌లో ఉంది. ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద సంతకం పెడతారో.. దాంతో ఎవరికి మూడుతోందో తెలీక.. జుట్టుపీక్కుంటోంది అమెరికా. నాటోన్లీ అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలన్నిటా ఇదే హైరానా. లేటెస్ట్‌గా ట్రంప్ టార్గెట్లు ఎవరో తెలుసా..? ఇండియన్ స్టూడెంట్స్. చదువుకోడానికెళ్లి ఇప్పటికే డిపోర్టేషన్ టెన్షన్‌తో బిక్కచచ్చిపోయిన మన విద్యార్థులను.. ఇప్పుడు కొత్తకొత్త ఇమ్మిగ్రేషన్ జంఝాటాలతో పీడకలలా వెంటాడుతున్నారు ట్రంప్. సిత్తరాల సిరపడి సిత్రాలు.. అగ్రరాజ్యపు అధినేతగా ఆయన పాల్పడే వికృత విన్యాసాలు.. దాంతో జరిగిపొయ్యే అనర్థాలు.. ఎన్నంటే ఏం చెప్పగలం..? రెండోసారి బెత్తం తీసుకుని పెత్తనం చెలాయిస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్.. సీట్లో కూర్చుంది మొదలు బాదుడే బాదుడు. లేటెస్ట్‌గా.. ప్రతీకార సుంకాల పేరిట ప్రపంచ దేశాల వాణిజ్యాలను కొరికిపారేయబోయి.. ఇప్పుడు సొంత దేశానికే కొరకరాని కొయ్యగా మారారు. అమెరికాకు ఎగుమతులు పడిపోతాయన్న భయంతో.. భారత్, చైనా, తైవాన్, జపాన్, దక్షిణకొరియా ఇలా అన్ని దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలి లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. చివరకు అమెరికన్ మార్కెట్లు సైతం అడ్డం తిరిగేశాయి. ధరలు పెరిగిపోతాయి.. మాంద్యం ముంచుకొచ్చేస్తోంది.. అనే భయంతో బిత్తరచూపులు చూస్తోంది అమెరికా సమాజం. అక్కడితోనే ఆగిపోలేదు.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని.. రోడ్డుమీదకొచ్చేసి.. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో.. పెద్దపెట్టున పొలికేక పెడుతోంది. ఇప్పుడు అమెరికాలో ఎటుచూసినా ట్రంప్ – గోబ్యాక్ నినాదాలే..! ఇది సహజంగానే ప్రెసిడెంటుగారికి పిచ్చెక్కించే అంశమే. సుంకాల...