అంతేకాక ఇలా చేయడం వల్ల శరీర రక్తప్రసరణ వేగవంతమై ఉత్సాహాంగా, ఫీల్ బెటర్‌గా ఉంటాం. మెట్లను ఎక్కి వెళ్లడం ద్వారా మీ ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇంకా బరువు తగ్గడంలో, కాలరీలను కరిగించడంలో ఇది సహాయపడుతుంది. శారీరక దారుఢ్యం కోసం ఎటువంటి ఖర్చు లేకుండా, ఫీజులు చెల్లించే అవసరం లేకుండానే మెట్లు ఎక్కితే సరిపోతుంది.