Video: విదేశాల్లో చిక్కుకున్న తెలుగోడికి అండగా మంత్రి కేటీఆర్.. తర్వలోనే ఇంటికి రప్పిస్తానంటూ హామీ..

KTR: పొట్టకూటి కోసం ఎడారి దేశాలకెళ్లే తెలుగోళ్ల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయ్‌. అలాంటి ఓ బాధితుడి ఆవేదన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్ల హృదయాలను కదలిస్తోన్న ఆ గల్ఫ్‌ బాధితుడి గోసపై కేటీఆర్‌ స్పందించారు.

Video: విదేశాల్లో చిక్కుకున్న తెలుగోడికి అండగా మంత్రి కేటీఆర్.. తర్వలోనే ఇంటికి రప్పిస్తానంటూ హామీ..
Minister Ktr
Follow us
Venkata Chari

|

Updated on: Jan 03, 2023 | 8:33 PM

Telangana: అన్నా, నన్ను తీసుకుపో, మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకును అంటూ గల్ఫ్‌ బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అన్నా నువ్వే నన్ను కాపాడాలి అంటూ మంత్రి కేటీఆర్‌కు సోషల్‌ మీడియాలో మొర్రపెట్టుకున్నాడు ఆ యువకుడు. బతుకుదెరువు కోసం రెండు నెలలక్రితం దుబాయ్‌ వెళ్లిన సిరిసిల్ల యువకుడు ఇమ్రాన్‌, ఏజెంట్ల చేతిలో మోసపోయాడు. ఫ్రీ వీసా అంటూ దుబాయ్‌ పంపిన కంపెనీ మోసం చేసింది. పంపించేటప్పుడు ఒక పని చెప్పి, అక్కడికి వెళ్లాక మరో పని చేయించడంతో తట్టుకోలేకపోయాడు ఇమ్రాన్‌. అక్కడ ఉండలేక, ఇండియాకి తిరిగిరాలేక నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్రెండ్స్‌కి చెప్పుకున్నాడు.

ఎలాగైనాసరే తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలంటూ ఏడుస్తూ పోస్ట్‌ పెట్టాడు ఇమ్రాన్‌. కేటీఆర్‌ అన్నా.. నన్ను ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు, ఫ్రీ విజిట్‌ వీసా అంటూ పంపి, ఆగమాగం చేస్తున్నారు. అన్నం లేదు-ఏం లేదు. నేనిక్కడ ఉండలేకపోతున్నా, దయచేసి నన్ను తీసుకుపో అన్నా అంటూ వేడుకున్నాడు. ఇమ్రాన్‌ ఫ్రెండ్స్‌ ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కి ట్యాగ్‌ చేయడంతో ఆయన స్పందించారు.

ఇవి కూడా చదవండి

నిన్ను తిరిగి ఇండియా తీసుకురావడానికి కృషి చేస్తామంటూ రిప్లై ఇచ్చారు. దుబాయ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు కేటీఆర్‌. అదేసమయంలో ఎన్నారై అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌తో టచ్‌లో ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!