Telangana: పైపైకి ఎర్రబంగారం ధరలు.. క్వింటాల్ ధర ఎంత పలికిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు..

మార్కెట్‌లో ఎండు మిర్చికి యమ గిరాకీ వస్తోంది. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతుంది. ఎర్రబంగారానికి రికార్డు స్థాయిలో..

Telangana: పైపైకి ఎర్రబంగారం ధరలు.. క్వింటాల్ ధర ఎంత పలికిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు..
Red Mirchi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 03, 2023 | 7:54 PM

మార్కెట్‌లో ఎండు మిర్చికి యమ గిరాకీ వస్తోంది. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతుంది. ఎర్రబంగారానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. తాజాగా వండర్ హాట్ మిర్చి రకానికి ఆల్ టైం రికార్డ్ ధర నమోదయింది. క్వింటాల్ మిర్చి ధర రూ. 39 వేలు పలికింది. ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్. పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. ఈ మార్కెట్‌కు తేజ, వండర్ హార్ట్ , 341 సింగల్ పట్టి, దేశీ మొదలైన రకాల వెరైటీ మిర్చీలు విక్రయించేందుకు రైతులు ఏనుమాముల మార్కెట్‌కు తీసుకువస్తూ ఉంటారు.

గత సంవత్సరం మిర్చి సీజన్ ప్రారంభంలో నిలకడగా ఉన్న ధరలు.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ముఖ్యంగా ‘వండర్ హార్ట్’ రకానికి గత సంవత్సరం రూ. 20 వేలతో ప్రారంభమైన ధర సీజన్ ముగిసే సరికి క్వింటాల్‌కు రూ. 41 వేలు పలికింది. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభంలోనే క్వింటాల్‌కు రూ. 39 వేలు పలకడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం తెగుళ్ల కారణంగా మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెట్టుబడి కూడా ఎక్కువైందని రైతులు చెబుతున్నారు. అయితే, మార్కెట్లో ధర చూస్తుంటే కొంత ఊరట లభిస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ముగిసే వరకు ఈ ధరలు ఇలాగే ఉంటే కొంత లాభదాయకంగా ఉంటుందని రైతులంటున్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మిర్చి ధరలు ప్రారంభంలోనే ఆశాజనకంగా ఉన్నాయని, ముఖ్యంగా వండర్ హార్ట్ రకానికి ఎగుమతులు ఉన్నందున ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం తెగుళ్ల కారణంగా తోటలు దెబ్బతిన్నాయని, రానున్న రోజుల్లో వండర్ హాట్ రకానికి మరింత ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారాలు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..