AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Expiry Time: పెట్రోల్‌కూ ఎక్స్‌పైరీ డేట్.. కారు ట్యాంక్‌లో ఎక్కువ రోజులు అలానే ఉంచితే ఏమవుతుందో తెలుసా..

ఎక్కువ పెట్రోల్ పోసిన తర్వాత వాహనం పార్క్ చేయకూడదు. ముఖ్యంగా, మీ వాహనం ఎక్కువసేపు పార్క్ చేసినపుడు. దీని వల్ల పెట్రోల్ చెడిపోవడమే కాకుండా..

Petrol Expiry Time: పెట్రోల్‌కూ ఎక్స్‌పైరీ డేట్.. కారు ట్యాంక్‌లో ఎక్కువ రోజులు అలానే ఉంచితే ఏమవుతుందో తెలుసా..
Do Not Store Petrol In Vehicle
Sanjay Kasula
|

Updated on: Jan 02, 2023 | 1:52 PM

Share

మగవాడు తిరగ చెడితే.. ఆడవారు తిరిగి చెడిపోతారని ఓ సామెత. అలాగే మన ఇంట్లోని వాహనం తిప్పకుంటే చెడిపోతుందని అంటారు. అయితే ఇక్కడే అందరికి ఓ ప్రశ్న మొదలవుతుంది. డ్రైవ్ చేయకుంటే వాహనం చెడిపోతే.. మరి అందులోని పెట్రోల్ పరిస్థితి ఏంటి..? అది కూడా చెడిపోతుందా..? బైక్, కారు, బస్సు, జీప్, ట్రక్, విమానం అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. అయితే మనం కొన్నిసార్లు దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన వాహనం పక్కన పెట్టేస్తాం. ఇంట్లోనివారు కూడా దానిని టచ్ చేయరు. అలానే ఉండిపోతుంది.

ఆ సమయంలో అందులో పెట్రోల్ కూడా ఉంటుంది. ఆ సమయంలో పెట్రోల్ చెడిపోతుందా..? ఆవిరి అవుతుందా..? ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా సార్లు వస్తుంటాయి. వాహనం నడపడం వల్ల వాహనంలో ఉన్న భాగాలు పాడైపోతాయి. అలాగే కారులో పడే పెట్రోల్ కూడా చెడిపోతుంది. కానీ చాలా మందికి ఈ వాస్తవం తెలియదు. వాహనంలో ఉన్న పెట్రోలు ఏ సమయంలో చెడిపోతుంది. దానిని సరైన సమయానికి ఉపయోగించాలి. మనం ఇప్పుడు ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాం..

తక్కువ పెట్రోల్ పెట్టండి

మీ వాహనంను ఎక్కవ రోజులు పక్కన పెట్టాల్సి వస్తే ముందుగా అందులో ఎంత పెట్రోల్ పోయించాలనే అంశంపై ఓ ప్లాన్ చేసుకోవాలి. వాహనం ఎక్కువసేపు పార్క్ చేసినపుడు అందులో ఉండే పెట్రోల్ ఉష్ణోగ్రతను బట్టి రసాయనిక చర్యలకు లోనవుతుంది. దీని కారణంగా దాని నాణ్యత తగ్గుతూ ఉంటుంది. అది చెడిపోవడం మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

చెడిపోవడానికి ఎంత సమయం పడుతుందంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెట్రోల్‌ను కంటైనర్‌లో ఉంచినట్లయితే ఒక సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. అదే సమయంలో, ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉంటే, కారులో ఉన్న పెట్రోల్ దాదాపు ఆరు నెలల వరకు బాగానే ఉంటుంది. మరోవైపు, ఉష్ణోగ్రత 30 డిగ్రీల చుట్టూ ఉంటే.. దాని జీవితం మూడు నెలలు. ఉష్ణోగ్రత పెరగడంతో..ఎంత త్వరగా పెట్రోలు చెడిపోయే అవకాశాలు ఉంటుంది.

అందుకే పెట్రోల్ ..

ముడిచమురు నుంచి పెట్రోలు వరకు అనేక ప్రక్రియలు సాగుతుంది. దీనితో పాటు, ఇథనాల్ కూడా ఇందులో కలుపుతారు. దీని కారణంగా వాహనం ట్యాంక్‌లో ఎక్కువసేపు పడి ఉన్నప్పుడు ఆవిరిగా మారుతుంది. అందుకే ఫ్యూయల్ ట్యాంక్ మూతపై చిన్న రంధ్రం చేసినా, ఒక్కోసారి అందులో చెత్త పేరుకుపోవడంతో అది మూసుకుపోయి ట్యాంక్‌లో ఉత్పత్తి అయ్యే ఆవిరి బయటకు రాలేక పెట్రోల్‌లో ఉండే ఇథనాల్ ఆ ఆవిరిని పీల్చుకుంటుంది. దీని కారణంగా పెట్రోల్ నెమ్మదిగా చెడిపోవడం ప్రారంభమవుతుంది.

కారు ఇంజిన్ చెడిపోతుంది

వాహనంలో ఎక్కువ సేపు నింపిన పెట్రోలు, ఎవరైనా వాడితే అది పాడైపోతుంది. కాబట్టి ఇది కార్బ్యురేటర్, ఇంజిన్ వరకు పెట్రోల్ వాహనంలోని ఇంధన పంపుపై తప్పు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల కారు ఇంజన్ త్వరగా పాడవుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం