Fridge Cleaning Tips: మీ ఇంట్లోని ఫ్రిజ్ నుంచి చెడు వాసన వస్తోందా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..

శీతాకాలంలో రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన సమస్య పెరుగుతుంది. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా...? అయితే ఈ కొత్త సంవత్సరంలో మీరు ఈ చిట్కాలను అనుసరించండి. వీటిని జస్ట్ ఫాలో అయితే మీ ఫ్రిజ్‌లో బ్యాడ్ స్మెల్ అస్సలు రాదు.

Fridge Cleaning Tips: మీ ఇంట్లోని  ఫ్రిజ్ నుంచి చెడు వాసన వస్తోందా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..
Bad Smell In Freezer
Follow us

|

Updated on: Jan 01, 2023 | 1:09 PM

శీతాకాలంలో రిఫ్రిజిరేటర్ చాలా అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ చాలా సార్లు ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్ లోపల చాలా కాలం పాటు ఉంచడం వలన.. రిఫ్రిజిరేటర్ వాసన రావడం ప్రారంభమవుతుంది. ఫ్రిజ్‌ని శుభ్రం చేసినా వాసన రాకపోవడం అనే సమస్య చాలామందికి ఉంటుంది. రిఫ్రిజిరేటర్ దుర్వాసనతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే.. కొత్త సంవత్సరంలో ఈ  చిట్కాలు మీ కోసమే. వీటిని అనుసరించడం ద్వారా మీరు రిఫ్రిజిరేటర్ దుర్వాసనను క్షణాల్లో తొలగించవచ్చు

ఫ్రిజ్ వాసన ఎందుకు వస్తుందో తెలుసా..? ఫ్రిజ్ నుంచి దుర్వాసన రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను మూత పెట్టకపోవడమే మొదటి కారణం. ఆహారాన్ని మూత పెట్టి ఉంచకపోవడం వల్ల ఫ్రిజ్ మొత్తం దుర్వాసన వస్తోంది. దీనితో పాటు, చాలా సార్లు ఆహారం, పాలు లేదా అనేక ఇతర వస్తువులు ఫ్రిజ్ లోపల వస్తాయి. వెంటనే శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి అయి దుర్వాసన సమస్య మొదలవుతుంది. పచ్చి కూరగాయలు చెడిపోవడం వల్ల రిఫ్రిజిరేటర్ కూడా దుర్వాసన వెదజల్లుతుంది. మీరు కూడా అలాంటి పొరపాటు చేస్తే, కొత్త సంవత్సరంలో వెంటనే సరిదిద్దుకోండి, తద్వారా మీరు ఫ్రిజ్ దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.

వాసన వస్తే ఫ్రిజ్‌లోబ్రెడ్ పెట్టండి

ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన సమస్యను బ్రెడ్ ద్వారా తగ్గించుకోవచ్చు. దీని కోసం.. ప్యాకెట్ నుంచి 2-3 బ్రెడ్లను తీసి ఫ్రిజ్ లోపల ఉంచండి.  స్పాంజిగా ఉండే బ్రెడ్ ఫ్రిజ్ వాసనను వెంటనే లాగేస్తుంది. ఫ్రిజ్ లోపల బ్రెడ్ ఉంచిన తర్వాత, అది వాసనను తీసుకోవడంతో ఆ సమస్యకు ఇక ఉండదు.

మీ సమస్యను నారింజ పరిష్కరిస్తుంది

వింటర్ సీజన్‌లో ఆరెంజ్ పుష్కలంగా దొరుకుతుంది. దీన్ని ఉపయోగించి మీరు ఫ్రిజ్‌లోని దుర్వాసనను తొలగించవచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో నీళ్లు కలిపి ఫ్రిజ్‌ని శుభ్రం చేయడం వల్ల దుర్వాసన పోతుంది. దుర్వాసనను పోగొట్టుకోవడానికి, ఫ్రిజ్‌ను శుభ్రం చేసిన తర్వాత, నారింజ తొక్కను కూడా ఫ్రిజ్ లోపల ఉంచవచ్చు. ఇది దుర్వాసన సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది.

పుదీనా కూడా ఉపయోగించవచ్చు

ఫ్రిజ్ శుభ్రం చేయడానికి నారింజ రసం బదులుగా పుదీనా కూడా ఉపయోగించవచ్చు. వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి పుదీనా సహాయపడుతుంది.. ఫ్రిజ్‌ను తాజాగా, దుర్వాసన లేకుండా ఉంచుతుంది. ఇందుకోసం పుదీనా ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసి వాటి రసం తీసి నీటిలో కలపాలి. ఈ ద్రవంతో ఫ్రిజ్‌ను శుభ్రం చేయండి.

కాఫీ గింజలు కూడా మంచి ఎంపిక

ఫ్రిజ్ వాసనను తొలగించడానికి కాఫీ గింజలను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం కాఫీ గింజలను గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ లోపల నుంచి వచ్చే వాసన తొలగిపోతుంది. కాఫీ గింజల పొడి చాలా ఘాడంగా ఉండటం కారణంగా అది వాసనను తొలగిస్తుంది.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

Latest Articles