Viral: ఫస్ట్‌నైట్ కోసం ఆతృతగా ఎదురుచూసిన వరుడు.. కట్ చేస్తే.. వధువు చెప్పిన మాటకు మైండ్ బ్లాంక్
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ప్రేమను కాస్తా పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ప్రేమను కాస్తా పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే.. ఫస్ట్‌నైట్ కోసం ఆతృతగా ఎదురుచూసిన వరుడికి సమయం రానే వచ్చింది. అయితే ఆ రోజే అతడికి ఓ షాకింగ్ నిజం తెలిసింది. దెబ్బకు నెక్స్ట్ రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
హర్యానాలోని దర్గాపూర్‌కు చెందిన సుఖ్‌లాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. కొద్దిరోజుల క్రిందట అతడికి ఒకమ్మాయి పరిచయమైంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరికొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక తొలిరాత్రికి సమయం రానే వచ్చింది. శోభనం గదిలోకి వెళ్లిన వరుడికి.. వధువు చెప్పిన మాటతో ఊహించని షాక్ తగిలింది. వధువు ట్రాన్స్‌జెండర్ అని తేలిపోయింది. దీంతో లబోదిబోమంటూ.. పొద్దున్నే లేచి పోలీసు స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. తనకు విడాకులు కావాలని ఆమెను కోరగా, భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు తన ఫిర్యాదులో సుఖ్‌లాల్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.