Indian Idly Sambar: చేయి తిరిగిన విదేశీయుడు.. ఇండియన్ రవ్వ ఇడ్లీ సాంబార్ ఇరగదీశాడుగా..
ఇండియన్ ఫుడ్ అంటే విదేశీయులు కూడా ఎంతో ఇష్టపడతారు. అలాంటివారిలో బ్రిటన్‌కు చెందిన జేక్ డ్రేన్ ఒకరు. అంతేకాదు, మన ఇండియాకి సంబంధించిన
ఇండియన్ ఫుడ్ అంటే విదేశీయులు కూడా ఎంతో ఇష్టపడతారు. అలాంటివారిలో బ్రిటన్‌కు చెందిన జేక్ డ్రేన్ ఒకరు. అంతేకాదు, మన ఇండియాకి సంబంధించిన వంటకాలు చేయడంలో జేక్‌ది అందెవేసిన చెయ్యి. అన్ని ప్రాంతాల వంటకాలనూ తయారు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. తన సోషల్‌మీడియా ఖాతా నిండా ఇండియన్ వంటకాలే ఉంటాయి. ఒక్కో వారం ఒక్కో రాష్ట్రానికి చెందిన వంటకం చేయడం ఈయన ప్రత్యేకత. ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, కర్నాటక, పంజాబ్ సహా పలు రాష్ట్రాల వంటకాలను జేక్ ట్రైచేశాడు. తాజాగా జేక్ తయారుచేసిన రవ్వ ఇడ్లీ, సాంబార్ డిష్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. జేక్ తయారు చేసిన ఈ సౌతిండియన్ డిష్‌కు ఫిదా అయిపోయారు నెటిజన్లు.. అంతేకాదు, ఈ రెసిపీకి పదికి పది మార్కులు ఇచ్చేశారు. పప్పును ఉడికించడంతో జేక్ సాంబార్ ప్రిపరేషన్‌ను మొదలుపెట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. రవ్వ ఇడ్లీ చేసేందుకు అవసరమైన పదార్దాలను సిద్ధం చేసుకుని డిష్ రెడీ చేసేవరకూ వీడియోలో జేక్ పనితనం అందరినీ ఆకట్టుకుంది. తమిళనాడు వీక్‌లో భాగంగా ఇడ్లీ, సాంబార్ సిద్ధం చేశాడు. ఈ వైరల్ వీడియోను 25 లక్షలమందికి పైగా వీక్షించారు. జేక్ డిష్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos