AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ తరహాలోనే మరో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి మూడున్నర కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్‌! ఆ తర్వాత..

ఢిల్లీ మహిళను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి, దారుణంగా హత్య చేసిన ఘటన మరువక మునుపే అచ్చం అలాంటి తరహాలోనే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రక్ ఢీ కొట్టడమేకాకుండా..

ఢిల్లీ తరహాలోనే మరో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి మూడున్నర కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్‌! ఆ తర్వాత..
UP woman killed as truck hits scooty
Srilakshmi C
|

Updated on: Jan 05, 2023 | 4:09 PM

Share

ఢిల్లీ మహిళను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి, దారుణంగా హత్య చేసిన ఘటన మరువక మునుపే అచ్చం అలాంటి తరహాలోనే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రక్ ఢీ కొట్టడమేకాకుండా మూడున్నర కిలోమీటర్లమేర ఈడ్చుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో బుధవారం (జనవరి 4) చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతురాలిని పుష్పా సింగ్‌ (32)గా పోలీసులు గుర్తించారు. బండా జిల్లా ఏఎస్పీ లక్ష్మీ నివాస్ మిశ్రా మాట్లాడుతూ.. బాధితురాలు లక్నోలోని అగ్రికల్చర్ యూనివర్శిటీలో క్లర్క్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త రంజిత్ కుమార్ 2020లో మరణించగా.. ఆ ఉద్యోగం పుష్పా సింగ్‌కు ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం నాడు పుష్ప తన ద్విచక్ర వాహనంపై కూరగాయలు కొని మావాయి బుజుర్గ్ క్రాసింగ్‌కు వెళ్తుండగా యూనివర్సిటీ గేటు సమీపంలో వెనుక నుంచి ఢీకొట్టింది. ఆమె వాహనం ట్రక్కులో ఇరుక్కుపోయినప్పటికీ దాదాపు మూడున్నర కిలోమీటర్లమేర ట్రక్‌ ఆమె శరీరాన్ని ఈడ్చుకెళ్లింది. రాపిడి కారణంగా ట్రక్కు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ ట్రక్‌ను వదిలి పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పరారైన డ్రైవర్‌ను అఖిలేష్ యాదవ్‌గా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసుల స్పెషల్‌ టీం తీవ్రంగా గాలిస్తోంది. ఈ ఘటనలో మహిళ శరీరం కాలిపోయింది. ఆమె ధరించిన బట్టలు, వాహనం ద్వారా మృతురాలిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. మృతురాలు పుష్పకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తక్షణమే చర్యలు చేపట్టి రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.