- Telugu News Photo Gallery A Under water Aquarium have been launched in Bengaluru and know more details of it such as timings Address
Bengaluru: సందర్శకులను ఆకర్షిస్తున్న బెంగళూరు టన్నల్ అక్వేరియం.. వైరల్ అవుతున్న ఫోటోలు..
బెంగళూరులోని టన్నెల్ అక్వేరియం జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు సాధారణ ప్రజల సందర్శనకు వీలుగా తెరిచే ఉంటుంది. సందర్శకుల కోసం టన్నెల్ అక్వేరియం ప్రదర్శన సమయం..
Updated on: Jan 05, 2023 | 2:57 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో విశిష్టమైన అండర్ వాటర్ అక్వేరియం ప్రారంభమైంది. విశేషమేమిటంటే సందర్శనకు వెళ్లినవారికి ఈ ఆక్వేరియంలో దాదాపు 200 రకాల చేపలు, జలచరాలు కనిపిస్తాయి.

అక్వేరియంలోకి ప్రవేశించడానికి వయోపరిమితి లేదు. పర్యాటకుల కోసం ఆటలు, స్నాక్స్, షాపింగ్ స్టాల్స్ ఉండడమే కాక కనుల విందు చేసేందుకు అనేక రకాల చేపలు అక్వేరియంలో ఉన్నాయి. వీటిని చూసినవారు ఎవరైనా థ్రిల్ కావాల్సిందే.

బెంగళూరులోని టన్నెల్ అక్వేరియం జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు సాధారణ ప్రజల సందర్శనకు వీలుగా తెరిచే ఉంటుంది.

మైసూర్ రోడ్, బెంగళూరులోని కెంగ్రీలో నిర్మితమైన ఈ అండర్ వాటర్ అక్వేరియం చూసేందుకు ఇప్పటికే స్థానికులు ఎగబడుతున్నారు.

సందర్శకుల కోసం టన్నెల్ అక్వేరియం ప్రదర్శన సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఇక దీనిలో ప్రవేశానికి ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.100 ఉంది.





























