Child care tips: పిల్లల్లో మట్టి తినే అలవాటు.. ఆరోగ్యానికి పెను ముప్పు..! ఇలా చేస్తే ఈజీగా మానేస్తారు..
మీ పిల్లలు కూడా మట్టి తింటున్నారా..? వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారా..? అయితే, ఇలాంటి కొన్ని నివారణ చిట్కాల ద్వారా మీరు పిల్లలు మట్టి తినే అలవాటును మాన్పించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Child Care Tips3
- శరీరంలో కాల్షియం, ఐరన్ లేకపోవడం వల్ల పిల్లలు మట్టి తినడానికి అలవాటు పడతారు. కొన్నిసార్లు మట్టి తినే రుగ్మత, పిల్లల ఉత్సుకత కారణంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మట్టి తినే అలవాటు పోషకాల కొరత కారణంగా సంభవిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పిల్లల పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
- అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం నిండిఉంటుంది. పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. దీనితో వారిలో కాల్షియం అవసరం పెరుగుతుంది. మట్టి తినే అలవాటును క్రమంగా వదిలించుకుంటారు.
- పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న వాటిని మాత్రమే తిననివ్వండి.
- పిల్లలకు బురద తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6-7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలకు తాగించండి. ఈ పరిహారం పని చేస్తుంది.
- అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం నిండిఉంటుంది. పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు.