Telangana: దున్నపోతుకు వినతి పత్రం.. ఇంతకీ వీరి డిమాండ్ ఏంటో తెలుసుకుందాం రండి..
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఈవెంట్స్ ముగిసినా.. ఈ వ్యవహారంపై అభ్యర్థులు ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ప్రభుత్వ పిచ్చి నిర్ణయాల వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఈవెంట్స్ ముగిసినా.. ఈ వ్యవహారంపై అభ్యర్థులు ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ప్రభుత్వ పిచ్చి నిర్ణయాల వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేబడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి, అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ వస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు.. ఇవాళ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హబ్సిగూడలో దున్నపోతుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్యుట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ రావు అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..