IND vs PAK: పాకిస్తాన్ రావాల్సిందే.. లేదంటే, వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనివ్వం: పీసీబీ కొత్త ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..

Asia Cup 2023: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ నజామ్ సేథీ, జై షా మధ్య వివాదం ముదిరింది. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 2023 ప్రపంచకప్ గురించి బీసీసీఐని బెదిరిస్తూ, పీసీబీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

IND vs PAK: పాకిస్తాన్ రావాల్సిందే.. లేదంటే, వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనివ్వం: పీసీబీ కొత్త ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..
India Vs Pakistan
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2023 | 3:18 PM

ODI World Cup 2023: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య మరోసారి విమర్శలు మొదలయ్యాయి. ఈసారి మ్యాటర్ ఆసియా కప్ గురించి. ఆసియా కప్ షెడ్యూల్‌ను గురువారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషా ప్రకటించారు. ఆ తరువాత పీసీబీ చీఫ్ నజం సేథీ, జై షాను లక్ష్యంగా చేసుకున్నాడు. పీఎస్ఎల్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించాల్సి ఉందని అన్నారు. అయితే దీని తర్వాత నజం సేథీ.. బీసీసీఐని కూడా బెదిరించాడు. భారత్ ఆసియా కప్‌ను తటస్థ వేదికపై ఆడితే, ప్రపంచకప్‌ను సైతం తటస్థ వేదికపైనే ఆడతామని చెప్పుకొచ్చాడు.

నజామ్ సేథి మాట్లాడుతూ, ‘తటస్థ ప్రదేశం అంటే ఏమిటి? మన టోర్నీని తటస్థ దేశంలో ఎందుకు ఆడాలి. భారత్-పాకిస్థాన్‌లు కూడా ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లు ఆడాలని.. పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు వెళ్తానని నజామ్ సేథీ తెలిపారు. కాదనే సమాధానం వస్తే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ ఆడదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌లో ఆసియా కప్ నిర్వహించడం కష్టమేనా?

నజామ్ సేథీ మాట్లాడుతూ, ‘2016 సంవత్సరంలో మాకు భద్రతా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ మేం టీ20 ప్రపంచ కప్ ఆడటానికి భారతదేశానికి వెళ్ళాం. మేం మా మ్యాచ్‌ని కోల్‌కతాకు మార్చడం గురించి కూడా మాట్లాడాం’ అంటూ ఆనాటి విషయాలు ఉదహరించారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్, బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరగదని, తటస్థ ప్రదేశంలో జరుగుతుందని జైషా సూచించాడు.

రమీజ్ రాజా బాటలోనే నజం సేథి..

అప్పటి పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా బీసీసీఐ వైఖరిని వ్యతిరేకించారనే సంగతి తెలిసిందే. భారతదేశంలో జరగనున్న ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తానని కూడా బెదిరించారు. పాకిస్తాన్‌కు ఆతిథ్య హక్కులను ఇవ్వాలనే నిర్ణయాన్ని ACC డైరెక్టర్ల బోర్డు తీసుకుందని, టోర్నమెంట్‌ను మార్చడంపై షా పిలుపునివ్వలేదని రాజా వాదించారు. బీసీసీఐ మాజీ అధికారులకు సన్నిహితంగా భావించే సేథీ, అయితే షా రోడ్ మ్యాప్ విడుదల చేసిన తర్వాత తీవ్రంగా స్పందించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..