AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేటగాళ్ల వలకు చిక్కిన భారీ చేప.. వేలం వేస్తే ఏకంగా రూ.2 కోట్లకుపైగా ధర పలికింది!

గురువారం (జనవరి 5) నాడు టోక్యోలోని టోయోసు ఫిష్ మార్కెట్‌లో వేలంపాట నిర్వహించారు. ఈ సారి దాదాపు 212 కిలోల బరువున్న..

వేటగాళ్ల వలకు చిక్కిన భారీ చేప.. వేలం వేస్తే ఏకంగా రూ.2 కోట్లకుపైగా ధర పలికింది!
Japan Tuna Dish Auction
Srilakshmi C
|

Updated on: Jan 06, 2023 | 3:15 PM

Share

టోక్యోలో ప్రతీయేట నిర్వహించే సంప్రదాయ న్యూఇయర్ ఉత్సవాల్లో భారీ పరిమాణంలో ఉండే ఒమా బ్లూఫిన్‌ టూనా ఫిష్‌ (చేప)ను పట్టుకుని వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గురువారం (జనవరి 5) నాడు టోక్యోలోని టోయోసు ఫిష్ మార్కెట్‌లో వేలంపాట నిర్వహించారు. ఈ సారి దాదాపు 212 కిలోల బరువున్న బ్లూఫిన్‌ టూనా ఫిష్‌కు ఎన్నడూలేని విధంగా గరిష్ఠంగా 2 కోట్ల రూపాయలు ధర పలికింది. ప్రముఖ సుషీ రెస్టారెంట్ అయిన ఒనోడెరా 36.04 మిలియన్ యెన్‌ల(సుమారు రూ.2 కోట్ల 25 లక్షలు)తో దీనిని కొనుగోలు చేశాడు. గతేడాది వేలంలో వచ్చిన మొత్తానికి (16.88 మిలియన్‌ యెన్‌లు అంటే కోటి రూపాయలు) ఇది రెట్టింపు. అంతేకాకుండా ఇప్పటి వరకూ జరిగిన వేలంపాటల్లో 2019లో టూనా ఫిష్‌ అత్యధిక ధర పలికింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా గత మూడేళ్ల తర్వాత తొలిసారి గరిష్ఠ స్థాయిలో ధర పలకడం విశేషం. ఎందుకంటే కోవిడ్‌ కారణంగా గడచిన మూడేళ్లలో ఈ చేప ధర పతనమవుతూ వస్తోంది.

ఒమా బ్లూఫిన్‌ టూనా ఫిష్‌ ప్రత్యేకత ఏంటంటే..

జపనీస్‌ సూషీ చెయిన్‌ అయిన ‘సూషీ జన్మాయ్‌’ అధ్యక్షుడు కియోషి కిమురా ప్రతీ ఏడాది కొత్త సంవత్సరంలో ఈ వేలం నిర్వహిస్తున్నారు. జపాన్‌లో ఒమా బ్లూఫిన్ టూనా ఫిష్‌కు డిమాండ్‌ ఎక్కువ. ఈ ఫిష్‌లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందుకే అంత రేటు పలుకుతుందని ఒనోడెరా మాస్టర్ చెఫ్ అకిఫుమి సకాగామి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో 8 మంది మనోళ్లే!
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో 8 మంది మనోళ్లే!
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?