Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ASUS: ఇంట్లోనే ఉండి 3డీ సినిమా చూసేయండిలా.. ఇక ఆ కళ్లద్దాలతో పనిలేదు..

సాధారణంగా ఈ 3D సినిమా చూడాలంటే థియేటర్ లోనే చూడాలి. అక్కడ వారు ఒక ప్రత్యేకమైన కళ్ల జోడు మనకు ఇస్తారు. అయితే ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ Asus(ఆసుస్) కళ్లద్దాలు లేకుండానే 3D పిక్చర్ చూసే డిస్ ప్లేను ఆవిష్కరించింది.

ASUS: ఇంట్లోనే ఉండి 3డీ సినిమా చూసేయండిలా.. ఇక ఆ కళ్లద్దాలతో పనిలేదు..
Asus
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2023 | 3:57 PM

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతతో వినోదరంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. దానిలో భాగంగానే వచ్చింది 3D సినిమా. అయితే సాధారణంగా ఈ 3D సినిమా చూడాలంటే థియేటర్ లోనే చూడాలి. అక్కడ వారు ఒక ప్రత్యేకమైన కళ్ల జోడు మనకు ఇస్తారు. అవి పెట్టుకుంటే గానీ 3D అనుభూతిని పొందలేం. అయితే ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ Asus(ఆసుస్) కళ్లద్దాలు లేకుండానే 3D పిక్చర్ చూసే డిస్ ప్లేను ఆవిష్కరించింది. దీనిని లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)లో ప్రదర్శించి, అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

పేరు ఏంటంటే..

తైవాన్ కు చెందిన Asus కంపెనీ ప్రోఆర్ట్ స్టూడియోబుక్ 16ను 3D డిస్‌ప్లేతో ఆవిష్కరించింది. ఈ నోట్‌బుక్ ను ఎటువంటి కళ్లద్దాలు లేకుండానే 3D అనుభవాన్ని అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.

2010లోనే వచ్చినా..

వాస్తవానికి 2010లోనే 3D మానిటర్‌లు, టెలివిజన్‌లు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే తక్కువ రిజల్యూషన్ ప్యానెల్‌లు, వినియోగ దారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వాటి విక్రయాలు సరిగ్గా జరగలేదు. ఆ తర్వాత కూడా పలు కంపెనీలు వారి 3D డిస్‌ప్లేలను ప్రదర్శించారు కానీ వాటిని మార్కెట్లోకి విడుదల చేయలేదు. అద్దాలు లేని 3D డిస్‌ప్లే మెయిన్ స్ట్రీమ్‌ను రూపొందించడంలో అత్యంత విజయవంతమైన ప్రయత్నం నింటెండో నుంచి వచ్చింది. దాని 3DS పోర్టబుల్ గేమ్ కన్సోల్ కలిగి ఉండే రెండు డిస్ప్లేలను రూపొందించింది.

ఇవి కూడా చదవండి

ఆసుస్ ప్రో బుక్ ఇలా..

ఆసుస్ కంపెనీ ప్రదర్శించిన ప్రో ఆర్ట్ స్టూడియో బుక్16.. 3200 x 2000 రిజల్యూషన్‌తో 16-అంగుళాల 3D OLED 120Hz ప్యానెల్‌తో వస్తుంది. దీని పూర్తి-స్క్రీన్ 2Dని స్టీరియోఫోనిక్ 3D కంటెంట్‌గా మార్చే సాఫ్ట్‌వేర్ ను అందిస్తుంది.

స్పెఫికేషన్లు ఇలా..

దీనిలో Intel 13వ జెన్ కోర్ HX, నెక్ట్స్ జెన్ Nvidia RTX GPU ఉంటుంది. అలాగే 8TB వరకు PCLe 4.0 SSD మెమరీ సామర్థ్యంతో రెండు అప్‌గ్రేడబుల్ M.2 స్లాట్లు.. 64GB మెమరీ సామర్థ్యంతో DDR5 4,800Mhz రెండు అప్‌గ్రాడబుల్ SO -DIMM స్లాట్‌లను అందిస్తుంది. దీనిలోని యాప్‌లను నియంత్రించడానికి ఫిజికల్ డయల్ అందుబాటులో ఉంటుంది. అలాగే Windows 11, Thunderbolt 4 HDMI 2.1తో కూడా వస్తుంది. దీని ధర ను Asus ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే దాని ఫీచర్లు , స్పెసిఫికేషన్ల ప్రకారం, దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని మార్కెట్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..