Displace TV: వైర్ లెస్ టీవీ వచ్చేసింది? ఎంచక్కా గోడకు బిగించకుండా అతికించేసుకోవచ్చు..
ప్రస్తుతం అంతకు మించిన ఆధునికత అందుబాటులోకి వచ్చింది. వాల్ మౌంట్ టీవీ స్థానంలో గోడకు లేదా విండోకు లేదా ఏదైనా గ్లాస్ డైరెక్ట్ గా అతికించే వ్యవస్థ అందుబాటులో వచ్చింది. అంతేకాక ఇది పూర్తిగా వైర్ లెస్.
ఆధునిక సాంకేతిక మనిషికి ఎంతో సౌకర్యాన్ని అందిస్తోంది. మాటల్లోచెప్పలేం. ఒకప్పుడు కంప్యూటర్ ఒక గదికి సరిపడినంత సైజ్ లో ఉండేది. ఇప్పుడు అది చిన్న టేబుల్ సరిపోయేంత సైజ్ కి వచ్చింది. పైగా వైర్ లెస్ డిజైన్ తో వచ్చేస్తున్నాయి. అలాగే టీవీలు కూడా స్మార్ట్ అయిపోయాయి. వాల్ మౌంట్ వచ్చాక ఇళ్లలో చాలా స్పేస్ కలిసి వస్తోంది. అయితే దీనికి విద్యుత్ సరఫరా, కేబుల్ కనెక్షన్ వంటివి తప్పనిసరి. అందుకనే మన గోడలో ఎక్కడ ఎలక్ట్రిక్ హోల్డర్ ఉంటుందో అక్కడే దానిని ఇన్ స్టాల్ చేయిస్తాం. ప్రస్తుతం అంతకు మించిన ఆధునికత అందుబాటులోకి వచ్చింది. వాల్ మౌంట్ టీవీ స్థానంలో గోడకు లేదా విండోకు లేదా ఏదైనా గ్లాస్ డైరెక్ట్ గా అతికించే వ్యవస్థ అందుబాటులో వచ్చింది. అంతేకాక ఇది పూర్తిగా వైర్ లెస్. దీనిని లాస్ వెగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్) లో ప్రదర్శించారు. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టీవీ ఎలా ఉంటుంది..
సాధారణ ఎల్ఈడీ టీవీ లాగానే ఉండే ఈ టీవీ పేరు ది డిస్ ప్లేస్ టీవీ. ఇది పూర్తిగా వైర్ లెస్, ఎటువంటి నట్లు బోల్టులు కూడా ఉండవు. కేవలం టీవీ వెనక వైపు ఉండే వ్యాక్యూమ్ తో ఎటువంటి సర్ఫేస్ మీద అయినా అవి ఇట్టే అతుక్కుపోతుంది. ఇది ప్రస్తుతం 55-అంగుళాల 4K OLED స్క్రీన్ తో వస్తుంది. యాక్టివ్-లూప్ వాక్యూమ్ టెక్నాలజీ ని వెనుకవైపు అమర్చారు. దీని ద్వారా సులభంగా వాల్ లేదా గ్లాస్పై అమర్చడానికి మళ్లీ తీసువేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనికి పవర్ కార్డ్ అవసరం ఉండదు. దీనిలో ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాటరీలు ఉంటాయి. ఆ బ్యాటరీల పరిమాణం, సామర్థ్యం , చార్జింగ్ సమయం వంటి వి ఆ కంపెనీ ఇంక ప్రకటించలేదు. అంచనా ప్రకారం వినియోగదారులు రోజుకు ఆరు గంటలపాటు టీవీని చూస్తే ఒక నెల రన్‌టైమ్ లభిస్తుంది. తాము భావిస్తున్నామని వారు చెప్పారు. ప్రతి యూనిట్ 20 పౌండ్ల కంటే తక్కువ బరువు ఉంటుంది. ఇది ఆకట్టుకునేలా తేలికగా ఉంటుంది.
ఎలా బిగిస్తారంటే..
టీవీని ఏదైనా గ్లాస్ వద్ద బిగించాలని అనుకుంటే టీవీని చేతులతో ఎత్తుకొని వెళ్లి ఆ గ్లాస్ క అతికించాలి. టీవీ వెనుకవైపు ఉండే వాక్యూమ్ లూప్‌లు ఆటోమేటిక్ గా అతుక్కుపోతుంది. అలా పూర్తి స్థాయిలో అతికినప్పుడు దానిని నుంచి ఓ సంకేతం వస్తుంది. ఇలా జరగడానికి కేవలం 8 సెకండ్ల సమయం పడుతుంది. ఒక వేళ మళ్లీ దానిని తీయాలంటే టీవీ రెండు పక్కలా ఉన చిన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు కొంత సేపటికి వ్యాక్యూమ్ వదిలేస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన చోట దానిని మళ్లీ బిగించుకోవచ్చు.
కెమెరా కూడా..
డిస్‌ప్లేస్ TV ఫ్రేమ్ పైభాగంలో పాప్-అప్ 4K కెమెరాను కలిగి ఉంది . ఇది కేవలం వీడియో కాల్ మాట్లాడటానికి మాత్రమే కాక.. టీవీలోని ప్రత్యేక సాఫ్ట్ వేర్ సాయంతో రిమోట్ లేకుండానే దానిని ఆపరేట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, ప్లేబ్యాక్ సమయంలో మీ అరచేతిని పట్టుకోవడం ద్వారా అది వచ్చే సాంగ్ లేదా వీడియోను పాజ్ చేస్తుంది. రెండు చేతులను ఉపయోగించడం ద్వారా స్క్రీన్‌పై ఐటెమ్‌లను జూమ్ ఇన్ మరియు అవుట్ చేయవచ్చు. ప్రస్తుతం దీని ధర $3,000 వద్ద ఉంది. ప్రీ ఆర్డర్ కోసం కేవలం 100 యూనిట్లు మాత్రే ఆ కంపెనీ ఉంచింది. వచ్చే డిసెంబర్ నుంచి షిప్పింగ్ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..