Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: కొత్త సంవత్సరం సరికొత్తగా రీచార్జ్ ప్లాన్స్.. జియో యూజర్లకు ఇక పండగే..

ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్లతో ముందుకొచ్చింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ప్రయోజనాలను అందించేలా ప్లాన్‌లు ఈ ప్లాన్లను తీర్చిదిద్దింది.

Reliance Jio: కొత్త సంవత్సరం సరికొత్తగా రీచార్జ్ ప్లాన్స్.. జియో యూజర్లకు ఇక పండగే..
Jio Recharge
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2023 | 6:38 PM

టెలికాం రంగంలో ఒక సంచలనం రిలయన్స్ జియో. తన స్పీడ్, నెట్ వర్క్ కేపబులిటీతో గ్రామగ్రామాలకు  విస్తరించింది. ఒక రకంగా గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేసింది. మార్కెట్లో అన్ని రంగాల వినియోగదారులకు అందుబాటులో ఉండేలా తన రీచార్జ్ ప్లాన్ లను మొదటి నుంచి అందుబాటులో ఉంచుతోంది. వాస్తవంగా చెప్పాలంటే అతి తక్కువ రీచార్జ్ ప్లాన్లతోనే జియో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇదే క్రమంలో ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త రీచార్జ్ ప్లాన్లతో ముందుకొచ్చింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ప్రయోజనాలను అందించేలా ప్లాన్‌లు ఈ ప్లాన్లను తీర్చిదిద్దింది. వినియోగదారులు తమకు ఇష్టమైన ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్ ను ఆస్వాదించేలా ప్రత్యేక ఓటీటీ ప్యాక్లను తీసుకొచ్చింది. ప్యాక్లతో అపరిమిత కాలింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. ఆ ప్లాన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఉత్తమ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు 2023

రూ. 299 ప్లాన్: ఈ ప్లాన్ తో వినియోగదారులు 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, 2GB డేటాతో మొత్తం 56GB పొందుతారు. ఈ ప్లాన్ జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

రూ. 666 ప్లాన్: జియో ప్రీపెయిడ్ వినియోగదారులు 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. ఇది 84 రోజుల ప్లాన్ వాలిడిటీతో వస్తుంది. అలాగే జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రూ. 719 ప్లాన్: ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా పరిమితి, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు 84 రోజుల ప్లాన్ వాలిడిటీతో పాటు జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

రూ. 749 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా పరిమితి, అపరిమిత కాలింగ్, 90 రోజుల ప్లాన్ వాలిడిటీ, రోజుకు 100 SMSలు ఉంటాయి. కాంప్లిమెంటరీగా జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది.

రూ. 2023 ప్లాన్: కొత్త సంవత్సరం 2023ని పురస్కరించుకుని జియో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్లో వినియోగదారులు 2.5GB రోజువారీ డేటా పరిమితితో 630GB డేటాను 252 రోజుల వాలిడిటీతో పొందుతారు. అంతేకాక జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌తో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు ఆనందించవచ్చు.

రూ.2999 ప్లాన్: రూ.2999 ప్లాన్‌పై జియో ప్రత్యేక ఆఫర్‌ను విడుదల చేసింది. అదనపు 23 రోజుల వ్యాలిడిటీ పొడిగింపుతో వినియోగదారులు 365 రోజుల ప్లాన్ వాలిడిటీని పొందవచ్చు . దీంతో పాటు ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2.5GB రోజువారీ డేటా పరిమితితో 912.5GB మొత్తం డేటా ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

జియో 5G ఎక్కడెక్కడ అంటే..

జియో నుంచి వెల్‌కమ్ ఆఫర్‌ను అందుకున్న యూజర్లందరికీ యాక్టివ్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉంటే అపరిమిత 5G డేటాను ఉపయోగించవచ్చు. జియో ట్రూ 5G గా వస్తున్న కొత్త తరం నెట్ వర్క్ ఇప్పుడు ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథద్వారా, కొచ్చి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల నగరాలలో పాటు గుజరాత్ లోని 33 జిల్లాల హెడ్ క్వార్టర్లలో అందుబాటులో ఉంది. ఇటీవల భోపాల్, ఇండోర్, లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్ ట్రిసిటీలో మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ ప్రాంతాలలోనూ జియో తన 5G సేవలను ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?