AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Human Composting: మనుషుల మృతదేహాలను ఎరువుగా మార్చి కూరగాయలు పండిస్తున్నారు..

మానవ వ్యర్ధాలతో సేంద్రియ ఎరువు తయారవుతుందని విన్నాం.. మృతదేహంతో కూడ ఎరువు తయారు చేయొచ్చా? అసలు అందుకు ఏ ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఆత్మీయులు, బంధువర్గాలు అస్సలు అంగీకరించరు అని అనుకుంటున్నారా? ఐతే మీకు ఈ విషయం చెప్పాల్సిందే..

Human Composting: మనుషుల మృతదేహాలను ఎరువుగా మార్చి కూరగాయలు పండిస్తున్నారు..
Human Composting
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2023 | 5:35 PM

మరణం తర్వాత ఈ దేహం ఏమవుతుంది? ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా ఒకటి, భౌతికంగా మరొకటి. ఆధ్యాత్మికంగానైతే ఎవరికి తోచినట్లు వాళ్లు రకరకాలుగా చెప్పుకుంటారు. టెక్నికల్‌గా చెప్పాలంటే.. మరణం తర్వాత ఖననం చేశాక దేహం కుళ్లిపోయి, మట్టిలో కలిసిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే.. సహజమైన సేంద్రీయ ఎరువుగా మారుతుంది. అదేంటి.. మానవ వ్యర్ధాలతో సేంద్రియ ఎరువు తయారవుతుందని విన్నాం.. మృతదేహంతో కూడ ఎరువు తయారు చేయొచ్చా? అసలు అందుకు ఏ ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఆత్మీయులు, బంధువర్గాలు అస్సలు అంగీకరించరు అని అనుకుంటున్నారా? ఐతే మీకు ఈ విషయం చెప్పాల్సిందే..

ఈ దేశంలో తొలిసారి చట్ట రూపం..

మానవ సేంద్రీయ ఎరువు తయారీకి తాజాగా న్యూయర్క్‌ తొలిసారిగా లీగల్‌ అప్రూవల్‌ పొందింది. హ్యూమన్‌ కంపోస్టింగ్ చట్టాన్ని ఆ దేశ ప్రభుత్వం ఆమోదించింది. మానవ అవశేషాలను సారవంతమైన నేలగా మార్చడానికి ఎకో ఫ్రెండ్లీ విధానంలో ఖననం చేస్తారు. ఈ విధంగా హ్యూమన్‌ కంపోస్టింగ్‌ చేయడాన్ని టెర్మేషన్ అని కూడా అంటారు. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్ సహా ఆరు రాష్ట్రాలు ఈ హ్యూమన్ కాంపోస్టింగ్‌కు అనుమతులు కూడా జారీచేశాయి. 2019లో వాషింగ్టన్ స్టేట్ ఈ చట్టానికి తొలిసారిగా ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

హ్యూమన్ కాంపోస్ట్ ఎలా తయారు చేస్తారంటే..

బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్‌తో పునర్వినియోగపరచదగిన మెటీరియల్స్‌తో మృతదేహాన్ని భద్రపరుస్తారు. అంటే మట్టి, కర్ర ముక్కలు, పచ్చి గడ్డి, ఎండు గడ్డితో నింపిన డబ్బాలో మృతదేహాన్ని 30 రోజులపాటు భద్రపరుస్తారు. సూక్ష్మజీవుల సాయంతో శరీరం విచ్ఛిన్నం అయ్యేలా జాగ్రత్తలు వహిస్తారు. ఇవి మృతదేహాన్ని సారవంతమైన ఎరువుగా మారేందుకు ప్రేరకంగా పనిచేస్తాయి. ‘నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్’ పద్ధతిలో మృతదేహాలను కాంపోస్ట్‌గా మారుస్తారు. నెల రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేస్తారు. ఈ విధంగా వేడి చేయడం వల్ల ప్రాణాంతకమైన ఇన్ ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. ఇలా తయారైన మట్టిని వారి ఆత్మీయులకు అందిస్తారు. లేదంటే పంట పొలాలకు సరఫరా చేయవచ్చు. ఇలా తయారు చేసిన హ్యూమన్‌ కంపోస్ట్‌ను నేరుగా మొక్కలకు వినియోగించకూడదు. అందుకు సిమెటరీ కార్పొరేషన్‌ ధృవీకరణ తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.

పెరుగుతున్న ఆదరణ..

వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, అందుకే హ్యూమన్ కాంపోస్టింగ్‌పై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని రీకంపోస్ ఫౌండర్ కత్రినా స్పేడ్ మీడియాకు తెలిపారు. సాధారణంగానైతే అంత్యక్రియలకు ఎక్కువ మొత్తంలో కట్టెలు, మట్టి అవసరం అవుతాయి. ఈ విధానంలో వీటి అవసరం చాలా తక్కువ. పైగా చాలా ప్రాంతాల్లో భూమి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు కూడా. దీంతో మంచి పరిష్కారమని అధికమంది ఆసక్తికనబరుస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.