Inspiring story: నాడు బీడీలు చుట్టిన సాధారణ కూలీ నేడు అమెరికాలో జడ్జి.. పడిలేచిన కెరటం సురేంద్రన్ జీవితం

కేరళలోని కాసరగోడ్‌లో అత్యంత పేద కుటుంబంలో జన్మించిన పటేల్‌కి ఇది భారీ విజయం.. సురేంద్రన్ తండ్రి రోజువారీ కూలీ.. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం.. సురేంద్రన్ యుక్తవయస్సులో ఉన్నప్పుడు తన సోదరితో కలిసి డబ్బు సంపాదించడానికి బీడీలు, సిగరెట్లను చుట్టారు.

Inspiring story: నాడు బీడీలు చుట్టిన సాధారణ కూలీ నేడు అమెరికాలో జడ్జి.. పడిలేచిన కెరటం సురేంద్రన్ జీవితం
Surendran K Pattel
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2023 | 4:03 PM

జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో కొందరు అవకాశాలను సృష్టించుకుని.. అంబరాన్ని అందుకుంటారు.. అలా జీవితంలో ఎదిగిన వ్యక్తుల పోరాటం నేటి యువతకు ఆదర్శం.. నేడు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో భారతీయ సంతతికి చెందిన న్యాయవాది సురేంద్రన్ కె పటేల్.. డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. పేదరికంలో పుట్టిన  సురేంద్రన్ లాయర్ గా ఎదగడం నుండి యునైటెడ్ స్టేట్స్‌లో జడ్జి పదవిని చేపట్టే వరకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని సాగించారు. జనవరి 1న, టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీలో ఉన్న 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా 51 ఏళ్ల సురేంద్రన్ కె పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలోని కాసరగోడ్‌లో అత్యంత పేద కుటుంబంలో జన్మించిన పటేల్‌కి ఇది భారీ విజయం.. సురేంద్రన్ తండ్రి రోజువారీ కూలీ.. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం.. సురేంద్రన్ యుక్తవయస్సులో ఉన్నప్పుడు తన సోదరితో కలిసి డబ్బు సంపాదించడానికి బీడీలు, సిగరెట్లను చుట్టారు. మరోవైపు పటేల్ కూలీగా కూడా పని చేసేవాడు. అయితే 10వ తరగతి తర్వాత చదువు గుడ్ బై చెప్పి.. ఫుల్ టైమ్ బీడీలు చుట్టే పని ప్రారంభించారు. అయితే కాలం అని తని నిర్ణయాన్ని మార్చింది. ఒక సంవత్సరం విరామం తర్వాత మళ్ళీ తాను చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

సురేంద్రన్ EK నాయనార్ మెమోరియల్ ప్రభుత్వ కళాశాలలో చేరారు. అయితే ఓ వైపు కూలి పనులకు వెళ్లడం.. మరోవైపు చదువు కొనసాగించడం కష్టంగా మారింది. దీంతో హాజరు తక్కువని చెప్పి..  సురేంద్రన్ ను పరీక్షల రాయడానికి కాలేజీ సిబ్బంది నో చెప్పింది. అప్పటికే లా చదవాలని నిర్ణయించుకున్న పటేల్.. తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులను వేడుకున్నారు. అంతేకాదు.. తనకు కనుక పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే.. చదువు మానేస్తానని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చారు.  కాలేజీ టాపర్ గా నిలిచారు సురేంద్రన్. దీంతో నెక్స్ట్ ఇయర్  పటేల్ చదువుకు ఎంతగానో ఉపాధ్యాయులు సహకరించారు. దీంతో కాలేజీలో టాపర్‌గా పట్టా పొందారు.

తర్వాత.. పటేల్ కాలికట్ గవర్నమెంట్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి చేయాలనుకున్నారు. అయితే చదువుకోలాంటే.. ఆర్థిక సమస్య ఉంది.  ఫస్ట్ ఇయర్ లో అతని స్నేహితులు అతనికి సహాయం చేశారు. ఆ తర్వాత  సురేంద్రన్ ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగంలో చేరారు. ఓ వైపు వివిధ పనులు చేస్తూనే చివరికి తనకు ఇష్టమైన లా లో 1995లో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1996లో కేరళలోని హోస్‌దుర్గ్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన ఆయన మంచి న్యాయవాదిగా అంచెలంచెలుగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు ఒక దశాబ్దం తరువాత.. అతను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కింది.

ఇవి కూడా చదవండి

2007 సంవత్సరం సురేంద్రన్ కుటుంబానికి USకు వెళ్లేందుకు అవకాశం వచ్చింది. అతని భార్య, ఒక నర్సు, ప్రముఖ అమెరికన్ మెడికల్ ఫెసిలిటీలో పనిచేయడానికి ఎంపిక అయ్యారు. దీంతో సురేంద్రన్ దంపతులు అమెరికాలో శాశ్వత నివాసాన్ని కోరుకున్నారు.  పొందారు.. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు వెళ్లారు. యుఎస్ వెళ్ళిన రెండు సంవత్సరాల తరువాత.. పటేల్ టెక్సాస్ బార్ పరీక్షను రాశారు.  తొలి ప్రయత్నంలోనే దాన్ని క్లియర్ చేశారు. పటేల్ US చట్టం గురించి పూర్తిస్థాయిలో అవగాహన సాధించాలని భావించారు.. దీంతో  అతను యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్‌లో LL.M ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించి  2011లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం పటేల్ కాంట్రాక్ట్ పని, కుటుంబ చట్టం, క్రిమినల్ డిఫెన్స్, సివిల్,  కమర్షియల్ లిటిగేషన్, రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన కేసులను చూసేవారు. తరువాత సొంతంగా న్యాయ సంస్థను స్థాపింకాహారు. డెమొక్రాటిక్ పార్టీతో జతకట్టిన పటేల్ నేడు యూఎస్ లో సక్సెస్ ఫుల్ న్యాయవాది.. ఇప్పుడు జడ్జిగా పదవిని స్వీకరించి చరిత్ర సృష్టించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!