Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: తేనెటీగల నుంచి విషాన్ని సేకరించి.. లక్షల్లో సంపాదిస్తున్న ఓ యువకుడు సక్సెస్ స్టోరీ

మానవునికి మేలు చేసే కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. వీటి నుంచి తేనెను మాత్రమే కాదు.. మైనము, పుప్పపడి, విషాన్ని కూడా సేకరిస్తాని మీకు తెలుసా.. ఈ విషం అత్యంత ఖరీదైంది. తేనే విషాన్ని సేకరించి లక్షలు సంపాదిస్తున్న ఓ యువకుడి సక్సెస్ స్టోరీ గురించి రోజు తెలుసుకుందాం.. 

Success Story: తేనెటీగల నుంచి విషాన్ని సేకరించి.. లక్షల్లో సంపాదిస్తున్న ఓ యువకుడు సక్సెస్ స్టోరీ
Bee Venom
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2023 | 12:42 PM

విషాన్ని కూడా రెండు రకాలుగా ఉపయోగించవచ్చు.. ప్రాణాలు తీయడానికి.. ప్రాణాలు కాపాడడం కోసం.. అందుకనే సృష్టిలో సహజంగా దొరికే విషం నిజంగా చాలా ఖరీదైంది. అది పాము విషమైనా , తేలు విషమైనా, లేక తేనే టీగల విషం అయినా సరే.. ఖరీదైన వస్తువులుగా నిలుస్తున్నాయి. సేకరించడం.. ఆ విషయాన్నీ జాగ్రత్తగా రక్షించడం కూడా ఖరీదైనదే.. ఏ జీవి నుంచి సేకరించిన విషయమైనా సరే.. మోతాదు మించనంత వరకూ అది ప్రాణాలు రక్షించే అమృతమే అవుతుంది. మానవునికి మేలు చేసే కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. వీటి నుంచి తేనెను మాత్రమే కాదు.. మైనము, పుప్పపడి, విషాన్ని కూడా సేకరిస్తాని మీకు తెలుసా.. ఈ విషం అత్యంత ఖరీదైంది. అనేక తీర ప్రాంతాల్లో ఈ తేనెను పండించే రైతులు చాలా మంది ఉన్నారు. అవును కోస్తా ప్రాంతంలో తేనె సేకరించే రైతులు చాలా మంది ఉన్నారు. అయితే తేనే విషాన్ని సేకరించి లక్షలు సంపాదిస్తున్న ఓ యువకుడి సక్సెస్ స్టోరీ గురించి రోజు తెలుసుకుందాం..

కర్ణాటక లోని మంగళూరు శివార్లలోని కిన్నిగోలికి చెందిన ప్రజ్వల్ శెట్టి  తేనె టీగల నుంచి విషాన్ని సేకరించడం.. దానిని ఫ్రీజర్‌లో భద్రపరచడం వంటి అంశాలను అధ్యయనం చేసి పరిపూర్ణ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం తేనెటీగ విషాన్ని వెలికితీసే యంత్రాన్ని స్వయంగా తయారు చేశాడు. ఇప్పుడు అతని దగ్గర ప్రస్తుతం ఐదు రకాల బీ వెనమ్ ఎక్స్‌ట్రాక్టర్‌ సిద్ధంగా ఉన్నాయి.

తేనె పెట్టె ముందు భాగంలో పాయిజన్ కలెక్టింగ్ ప్లేట్ ఉంచబడుతుంది. చిన్న వోల్టేజ్ వద్ద బ్యాటరీ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. ఈగలు ప్లేట్‌పై కూర్చున్నప్పుడు,.. విద్యుత్ తో కంపిస్తాయి. తమ పాయిజన్ హుక్‌తో గాజు పలకను కుడతాయి. అప్పుడు తేనె టీగల విషం గాజు మీద పేరుకుపోతుంది. వెంటనే అది షేవింగ్ రేజర్ ద్వారా సేకరించబడుతుంది. ఇలా తేనె టీగల నుంచి విషాన్ని సేకరిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి
Bee Venom 2

Bee Venom 2

ఈ తేనె విషాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తేనెటీగ విషాన్ని కీళ్ల నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్  నివారణ చికిత్సకు ఉపయోగించే విషయంపై ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో దీనికి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు భారీ మొత్తంలో కొనుగోలు చేస్తాయి. పూణె, ఢిల్లీ, మహారాష్ట్రలో ఈ  తేనె టీగల విష సేకరణ జరుగుతోంది. అయితే కర్ణాటకలో రైతులకు తేనె టీగల విషం సేకరించడంపై అంతగా సమాచారం లేదని ప్రజ్వల్ శెట్టి అంటున్నారు.

ఒక పాయిజన్ కలెక్షన్ ప్లేట్ ఖరీదు..  మార్కెట్‌లో 20 వేలకు పైగా ఉంటుంది. అదే మెల్లిఫెరా జాతికి చెందిన తేనె టీగల విషం అయితే మరీ ప్రత్యేకమైనది. అయితే తీరప్రాంతల్లో, ఎత్తైన ప్రాంతాల్లో, సెరెనా రకం తేనె టీగలు ఎక్కువగా ఉంటాయి. ప్రజ్వల్ తేనె టీగలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని సేకరించి.. తానే సొంతంగా ప్రయోగాలు చేస్తూ.. బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…