Amazon Republic Day Sale: అమెజాన్‌ ఆఫర్ల జాతర వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు, ఎప్పుడంటే..

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో అదిరిపోయే సేల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. దసరా సందర్భంగా సెప్టెంబర్‌లో నిర్వహించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ తర్వాత అమెజాన్‌ మళ్లీ సేల్‌ను నిర్వహించలేదు. దాదాపు మూడు నెలల తర్వాత..

Amazon Republic Day Sale: అమెజాన్‌ ఆఫర్ల జాతర వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు, ఎప్పుడంటే..
Amazon Republic Day Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2023 | 9:00 PM

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో అదిరిపోయే సేల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. దసరా సందర్భంగా సెప్టెంబర్‌లో నిర్వహించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ తర్వాత అమెజాన్‌ మళ్లీ సేల్‌ను నిర్వహించలేదు. దాదాపు మూడు నెలల తర్వాత అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో మరోసారి ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రతీఏటా రిపబ్లిక్‌ సేల్‌ను నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఈ సేల్‌ను నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది.

జనవరి 19వ తేదీన మొదలయ్యే అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌, జనవరి 22వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ప్రైమ్‌ మెంబర్స్‌కి మాత్రం ఒకరోజు ముందుగానే అంటే జనవరి 18వ తేదీనే సేల్ ప్రారంభంకానుంది. కొత్తేడాదిలో వస్తోన్న తొలి సేల్ కావడంతో కస్టమర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అమెజాన్‌ ఇప్పటి వరకు ఈ సేల్‌లో ఎలాంటి ఆఫర్స్‌ ఉండనున్నాయన్న దానిపై అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. కానీ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్డుతో కొనుగోలు చేసిన వారికి మాత్రం 10 శాతం డిస్కౌంట్‌ అందంచనున్నారు.

ఇక ఈ సేల్‌లో అమెజాన్‌ భారీ డిస్కౌంట్స్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. మొబైల్‌ ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్స్‌, టీవీలు, వాషింగ్ మిషిన్లు, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్‌లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై అమెజాన్‌ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు సమాచారం. ఈ సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, డిస్కౌంట్స్‌ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..