Volvo Electric Car: వోల్వో నుంచి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. గూగుల్ ప్రత్యేక ఫీచర్ తో పాటు అదిరిపోయే సౌండ్ సిస్టమ్
వోల్వో కూడా ఇటీవల తన కొత్త మోడల్ ఈవీ కాార్ ను కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2023లో ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు ఎక్స్ సీ 40, సీ 40 కు కొనసాగింపుగా ఈఎక్స్ 90 ను తీసుకొచ్చింది. ఈఎక్స్ 90 కార్ తన ఎక్స్ సీ 40 కంటే పొడవుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం అన్ని కార్ల కంపెనీల తమ ఈవీ వెహికల్స్ లాంచ్ పై దృష్టి పెడుతున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా కొత్త మోడల్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇదే కోవలో వోల్వో కూడా ఇటీవల తన కొత్త మోడల్ ఈవీ కాార్ ను కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2023లో ప్రవేశపెట్టింది. ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు ఎక్స్ సీ 40, సీ 40 కు కొనసాగింపుగా ఈఎక్స్ 90 ను తీసుకొచ్చింది. ఈఎక్స్ 90 కార్ తన ఎక్స్ సీ 40 కంటే పొడవుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే భారీ బ్యాటరీ కారణంగా గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం బాగా తక్కువ ఉంటుందని ఆటోమోబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
వోల్వో ఈఎక్స్ 90 లో థోర్స్ హామర్ ఎల్ఈడీ లైట్లు, ఎక్స్ సీ 40 రీచార్జ్ వంటి సూపర్ స్టైలింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. అలాగే ఫ్లష్ ఫిటింగ్ డోరు హ్యాండిల్స్ 22 అంగుళాల ఎలోయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. అలాగే టెక్నాలజీ విషయానికి వస్తే వోల్వో ఈఎక్స్ 90 చుట్టూ 8 కెమెరాలు, 16 అల్ట్రా సోనిక్ సెన్సార్ లు ఉన్నాయి. అలాగే విశాలమైన క్యాబిన్, క్యాబిన్ లోపల కూడా కెపాసిటివ్ స్టీరింగ్ ఉంటుంది. అలాగే డ్రైవింగ్ చేసే వాళ్లు నిద్రపోతే సెన్సార్ ద్వారా అలెర్ట్ చేయడం వోల్వో ఈఎక్స్ 90 ప్రత్యేకత.
అలాగే ఈ కార్ లో గూగుల్ ఓఎస్ సపోర్ట్ తో 14.5 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. ఓటీఏ అప్ డేట్ లను కూడా ఎనెబుల్ చేస్తుంది. ఇది పనోరమిక్ సన్ రూఫ్, బోవర్స్, విల్కిన్స్ వంటి ఆడియో సిస్టమ్స్ తో స్పీకర్లను సీట్ హెడ్ రెస్ట్ ల వద్ద వచ్చే విధంగా డిజైన్ చేశారు. అలాగే ఈ కార్ డ్యుయల్ మోటర్-ఆల్ వీల్- పవర్ ట్రెయిన్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ కార్ బేస్ మోడల్ 408 బీహెచ్ పీ, 770 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే హై ఎండ్ మోడల్ 517 బీహెచ్ పీ, 910 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు గంటకు 180 కిలో మీటర్లు వెళ్లేలా డిజైన్ చేశారు. అయితే త్వరలో ఈ కార్ బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే 2024 నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తామని స్పష్టం చేసింది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం