AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Breaking Video: ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..! మనసును కలచి వేస్తోన్న..

ఈ వీడియోలోని దృశ్యం చూస్తే.. ఒక్కసారిగా మనసంతా చేదైపోతోంది. ఎందుకంటే బతకాలనే యావ ఒక్క మనిషికి మాత్రమే ఉంటుందనే అభిప్రాయం కాదు.. కాదు.. స్వార్ధం సరికాదని

Heart Breaking Video: ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..! మనసును కలచి వేస్తోన్న..
Viral Video
Srilakshmi C
|

Updated on: Jan 06, 2023 | 6:47 PM

Share

ప్రాణానికి ఖరీదు కట్టమంటే ఎలా కొలుస్తారు..? అది మనిషి ప్రాణమా.. లేక మూగ జీవి ప్రాణమా అనే మీమాంస అక్కరలేదు. ఎందుకంటే ప్రాణం విషయంలో భేషజాలు తగవని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలోని దృశ్యం చూస్తే.. ఒక్కసారిగా మనసంతా చేదైపోతోంది. ఎందుకంటే బతకాలనే యావ ఒక్క మనిషికి మాత్రమే ఉంటుందనే అభిప్రాయం కాదు.. కాదు.. స్వార్ధం సరికాదని ఈ మూగజీవి చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది మీరు కూడా గుండె గట్టిగా పట్టుకుని చూడండి. ఇంతకీ ఏం జరిగిందంటే..

గ్యాస్‌ స్టవ్‌పై పెనం పెట్టి.. దానిలో వేడి వేడి నూనె కాగుతుంటుంది. ఆ తర్వాత తోక నుంచి సగానికి కోసిన చేప ముక్కను ఆ నూనెలో వదులడం కనిపిస్తుంది. అంతే వేడి నూనె తాలూకు సెగ చేపముక్కకు తగలగానే ఒక్కసారిగా అది గిలగిలా కొట్టుకుంటుంది. ఇక్కడ మీకో సందేహం కలగవచ్చు. చేప తలకాయ వేరు చేసి.. దానిని శుభ్రం చేసి మసాలా పట్టించిన తర్వాతే కదా పెనంలో కాగుతున్న నూనెలో వేసింది అరి అనుకుంటున్నారు కదూ..! అవును.. అది నిజమే అయినప్పటికీ కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు అడపాదడపా అక్కడక్కడా చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా చేపలు ఇలా పూర్తిగా కట్‌ చేసిన తర్వాత కూడా బతకడం కోసం అవి చేసే పోరాటం కంటతడి పెట్టిస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే ఇది. మీరేమంటారు..?

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.