Medical Miracle: పాలప్యాకెట్‌ కంటే తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ.. వైద్య చరిత్రలోనే తొలిసారిగా..

ఆ శిశువు బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే ఉంది. అంటే పాల ప్యాకెట్‌ కన్నా తక్కువ బరువన్నమాట. శివన్య కథ గురించే మనం చర్చిస్తోంది..

Medical Miracle: పాలప్యాకెట్‌ కంటే తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ.. వైద్య చరిత్రలోనే తొలిసారిగా..
Pune Baby Girl
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2023 | 8:06 PM

తల్లి గర్భంలో తొమ్మిది నెలలు నిండకుండానే జననాలు (మైక్రో-ప్రీమీస్) సంభవిస్తుంటాయి. సాధారణంగా 8వ లేదా 7వ నెలలో శిశువులు జన్మిస్తుంటారు. వీరిని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి పూర్తి ఆరోగ్యవంతులుగా మారిన తర్వాత తల్లికి అప్పగిస్తుంటారు వైద్యులు. ఐతే గత ఏడాది అతితక్కువగా 24 వారాలు (ఆరు నెలలు) వయసున్న శిశువు జన్మించి అందరినీ ఆశ్చర్య పరిచింది. పైగా బిడ్డ బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే ఉంది. అంటే పాల ప్యాకెట్‌ కన్నా తక్కువ బరువన్నమాట. శివన్య కథ గురించే మనం చర్చిస్తోంది.

పూణేలోని వాకాడ్‌లో గత ఏడాది మే 21న శివన్య జన్మించింది. 94 రోజుల ఇంటెన్సివ్ కేర్ తర్వాత 2,130 గ్రాముల బరువుతో ఆగస్టు 23న డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం శివన్య 4.5 కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉంది. నిజానికి ఇటువంటి శిశువుల్లో బతికే రేటు 0.5% కంటే తక్కువగా ఉంటుంది. గర్భం దాల్చిన 37-40 వారాల తర్వాత పుట్టిన పిల్లలు కనీసం 2,500 గ్రాముల బరువు కలిగి ఉంటారు. దీంతో శివన్య మన దేశ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పింది. శివన్య దేశంలో అతి పిన్న వయస్కురాలని పూణేలోని సూర్య మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సచిన్ షా పేర్కొన్నారు. డాక్టర్ సచిన్ షా మీడియాలో మాట్లాడుతూ.. ‘నెలలు నిండకుండానే ముందస్తు జననాలు అరుదుగా జరుగుతుంటాయి. దీనిని డబుల్ గర్భాశయం (బైకార్న్యుయేట్) అని పిలుస్తారు. ఒక స్త్రీ గర్భంలో రెండు వేర్వేరు సంచులు ఉన్నట్లయితే.. వాటిల్లో ఒక సంచి చిన్నగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. శివన్య శిశువు పిండంగా ఉన్నప్పుడు చిన్న సంచిలో పెరిగింది. అందువల్లనే కేవలం 24 వారాలకే పుట్టింది’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.