ప్రొఫెసర్‌ ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసిన పోలీసుల.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు చూసి ఖంగుతిన్న ఖాఖీలు

తాజాగా ఓ ప్రొఫెసర్‌ ఫ్లాట్‌పై శుక్రవారం (జనవరి 6) దాడి చేసిన పోలీసులు రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు..

ప్రొఫెసర్‌ ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసిన పోలీసుల.. కుప్పలుతెప్పలుగా నోట్ల కట్టలు చూసి ఖంగుతిన్న ఖాఖీలు
West Bengal Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2023 | 9:55 PM

పశ్చిమ బెంగాల్‌లో కొన్ని నెలల క్రితం టోలీగంజ్, బెల్గారియా, గార్డెన్‌రిచ్ ప్రాంతాల్లో కోట్ల రూపాయాల అక్రమ సొమ్ము పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బరాక్‌పూర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు పరగణాస్‌లోని ఖర్దాలో నాథుపాల్ ఘాట్ రోడ్ ప్రాంతంలోనున్న అమితాబ్ దాస్ అనే ఓ ప్రొఫెసర్‌ ఫ్లాట్‌పై శుక్రవారం (జనవరి 6) దాడి చేసి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా గురువారం రాత్రి నుంచి ఖర్దాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు పక్కా సమాచారం అందడంతో ఈ మేరకు దాడి చేయగా భారీ మొత్తంలో డబ్బు దొరికింది. విద్యాసంస్థలో అడ్మిషన్లు కల్పించడానికి కమీషన్‌గా ఈ డబ్బును సంపాదించినట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు.

వృత్తి రీత్యా ప్రొఫెసర్ అయిన అమితాబ్‌కు భార్య వర్ణాలి సాధుఖాన్, వారి కుమారుడితో కలిసి గత రెండున్నరేళ్లుగా ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు ప్రొఫెసర్ ఇంట్లో గత రాత్రి నుంచి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌ ఫ్లాట్‌ నుంచి సుమారు రూ.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో ఇంత డబ్బు తనకు ఎలా వచ్చిందన్న విషయాన్ని ప్రొఫెసర్ ఇంకా వెల్లడించలేదు. బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్ ప్రొఫెసర్‌ను విచారిస్తున్నారు. అనంతరం పూర్తి వివరాలు బయటపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి