Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prince Harry: ‘ఆఫ్గన్‌ తాలిబన్లను 25 మందిని చంపాను.. నా దృష్టిలో వాళ్లు మనుషులు కాదు’.. ప్రిన్స్‌ హ్యారీ సంచలన వ్యాఖ్యలు

జనవరి 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ స్పెయిల్‌లో గురువారం (జనవరి 5) ఈ పుస్తకం అనూహ్యంగా మెయిల్‌ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించారు. దీంతో పలువురి చేతుల్లో ఈ పుస్తక ప్రతులు..

Prince Harry: 'ఆఫ్గన్‌ తాలిబన్లను 25 మందిని చంపాను.. నా దృష్టిలో వాళ్లు మనుషులు కాదు'.. ప్రిన్స్‌ హ్యారీ సంచలన వ్యాఖ్యలు
Prince Harry
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 06, 2023 | 8:15 PM

క్వీన్‌ ఎలిజబెత్‌ చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ బ్రిటన్‌ రాజకుటుంబానికి దూరమైన సంగతి తెలిసిందే. నటి మేఘన్‌ మెర్కెల్‌తో పెళ్లి విషయంలో రాజ కుటుంబంతో అభిప్రాయభేదాలు తలెత్తడంతో కుటుంబానికి దూరంగా భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఐతే తాజా హ్యారీ ‘స్పేర్‌’ పేరుతో తన జీవిత చరిత్రను పుస్తకంగా రచించాడు. దీనిని జనవరి 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కూడా. ఐతే స్పెయిల్‌లో గురువారం (జనవరి 5) ఈ పుస్తకం అనూహ్యంగా మెయిల్‌ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించారు. దీంతో పలువురి చేతుల్లో ఈ పుస్తక ప్రతులు ప్రత్యక్ష మయ్యాయి.

ఆత్మకథ ‘స్పేర్‌’ బుక్‌లో హ్యారీ పలు కీలక విషయాలను బయటపెట్టాడు. తాను ఆఫ్ఘనిస్తాన్‌లో అపాచీ హెలికాప్టర్ పైలట్‌గా ఉన్న సమయంలో ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్లను దాదాపు 25 మందిని చంపినట్లు ప్రిన్స్ హ్యారీ తన ఆత్మకథ ‘స్పేర్’ వెల్లడించాడు. తాను చంపిన వారిని మనుషులుగా పరిగణించడంలేదని, చదరంగం ఆటలో పావులు మాదిరి బోర్డు నుంచి తీసివేసినట్లు తెలిపాడు. హ్యారీ బ్రిటీష్ ఆర్మీలో కెప్టెన్‌గా 10 ఏళ్లు పనిచేశాడు. ఆ సమయంలో ల్యాప్‌టాప్‌లు ఉండిఉంటే తాను ఎంతమంది శత్రువులను చంపాడో వారి సంఖ్య ఖచ్చితంగా చెప్పేవాడినని పేర్కొన్నాడు.

ప్రిన్స్ హ్యారీ 2015 వరకు మిలిటరీలో పనిచేశాడు. ఆ సమయంలో తాను ఆరు మిషన్లలో పనిచేసినట్లు వెల్లడించాడు. యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన 9/11 దాడుల తర్వాత బాధిత కుటుంబాలను కలిసినట్లు హ్యారీ తన పుస్తకంలో తెలిపాడు. వారిని కలిసిన తర్వాత ప్రిన్స్ హ్యారీ తన చర్యలను సమర్థించుకున్నాడు. వారిపై పోరాడడం మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరానికి ప్రతీకార చర్య అని వ్యాఖ్యానించాడు. హ్యారీ ఆత్మకథలో ప్రస్తావించిన ఈ విషయాలు ప్రస్తుతం ఆయన భద్రతపై భయాలను రేకెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి

తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం, అన్నదమ్ముల మధ్య ఘర్షణ గురించిన విషయాలు హ్యారీ తన ఆత్మకథ ద్వారా వెల్లడించాడు. ‘స్పేర్‌’లో హ్యరీ బయట పెట్టిన ఈ సంచలన విషయాలు కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను ఈ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.