AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: కూతురుపై వల్లమాలిన ప్రేమ.. తల్లి చనిపోవడంతో ఏ మగాడు చేయని పనికి ఒప్పుకున్నాడు..

తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుందని అంటారు. ఇందుకు సంబంధించి ఎన్నో కథలు, వాస్తవాలు వినడం, చూడటం జరిగింది. కానీ, ఇక్కడ ఒక తండ్రి తన కూతుళ్ల రక్షణ కోసం, వారి ఆలనా పాలనా కోసం ఏ మగాడు చేయని..

Shocking: కూతురుపై వల్లమాలిన ప్రేమ.. తల్లి చనిపోవడంతో ఏ మగాడు చేయని పనికి ఒప్పుకున్నాడు..
Father Daughter
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 06, 2023 | 9:46 PM

తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేస్తుందని అంటారు. ఇందుకు సంబంధించి ఎన్నో కథలు, వాస్తవాలు వినడం, చూడటం జరిగింది. కానీ, ఇక్కడ ఒక తండ్రి తన కూతుళ్ల రక్షణ కోసం, వారి ఆలనా పాలనా కోసం ఏ మగాడు చేయని పని చేశాడు. తల్లిని మించి ప్రేమతో తన కూతుళ్లను పెంచేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈక్వెడార్‌లో వెలుగు చూసిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తోంది. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడు? అంత పెద్ద నిర్ణయం ఏం తీసుకున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈక్వెడార్‌ కు చెందిన రెనే సాలినాస్ రామోస్(47) తన కుమార్తెల సంరక్షణ కోసం రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్లి చట్టబద్ధంగా తన లింగాన్ని మార్చుకున్నాడు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కూతుళ్లను తన వద్దే ఉంచుకోవాలనుకున్నాడు. కానీ ఈక్వెడార్ చట్టం అందుకు అడ్డొస్తుంది. భార్య నుంచి విడిపోయాడు.. కూతుళ్లంటే వల్లమాలిన ప్రేమ.. వారిని తన వద్ద ఉంచుకోవాలంటే ఏం చేయాలా? బాగా ఆలోచించాడు. చట్ట ప్రకారం ఏం చేస్తే ఉపయోగం ఉంటుందని థింక్ చేశాడు. చట్ట ప్రకారం చూసుకుంటే.. పిల్లల సంరక్షణ బాధ్యతను తల్లికే అప్పగిస్తారు. దాంతో తాను తండ్రి కావడం వల్ల తన కూతుళ్లను తన దగ్గర ఉంచుకోలేకపోయాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా తట్టింది. అదే తాను తల్లిగా మారాలని భావించాడు. తన పిల్లల కోసం అతను ఏకంగా తన లింగాన్ని మార్చుకున్నాడు. మహిళగా మారాడు.

అయితే, తన భార్య కారణంగా కుమార్తెలు చెడిపోతున్నారని, చెడు వాతావరణంలో జీవిస్తున్నారని రెనే ఆరోపించాడు. దాదాపు 5 నెలల పాటు రెనే తన కూతుళ్లకు దూరమయ్యాడు. ‘కస్టడీ హక్కు మహిళకే ఉందని చట్టం చెబుతోంది. ఇప్పుడు నేను కూడా స్త్రీనే. నేను కూడా తల్లినే. నా పిల్లలను నాకు అప్పగించాలి.’ రెనే డిమాండ్ చేశాడు. ‘నేను ఏం చేశానో నాకు తెలుసు. మగవారు తమ పిల్లలను తల్లి కంటే తక్కువగా చూసుకుంటారనేది కేవలం అపోహ మాత్రమే. ఆ అపోహను తొలగించేందుకు నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా కూతుళ్లకు తల్లిలా ప్రేమను, తండ్రిలా రక్షణను ఇవ్వగలను. ఈ దేశంలో తండ్రి కావడం శాపం లాంటిది. ఇక్కడ పురుషులు కేవలం ప్రొవైడర్లుగా మాత్రమే కనిపిస్తారు’ అంటూ వాపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..