New Couple: ‘నన్ను కూడా ఎత్తుకో..’ అంటూ నవ దంపతుల మధ్యకు వచ్చిన కోతి.. వీడియో వైరల్.
ఒక నూతన జంట ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు. తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌లో వధువు. సిల్వర్ కలర్ సూట్‌లో వరుడు ఎంతో అందంగా మెరిసిపోతున్నారు. ఈ క్రమంలో
ఒక నూతన జంట ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు. తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌లో వధువు. సిల్వర్ కలర్ సూట్‌లో వరుడు ఎంతో అందంగా మెరిసిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఒక కోతి వచ్చింది. బిడ్డతో సహా వచ్చిన ఆ మెక్సికన్ స్పైడర్ కోతి వచ్చి నూతన దంపతుల వెడ్డింగ్ షూట్‌ను డిస్టర్బ్ చేసింది. కోతి తమ దగ్గరకు రాగానే వధువు కాస్త భయపడి పక్కకు వెళ్లింది. అంతే కోతి అక్కడే ఉన్న వరుడి చేయి పట్టుకుని నన్ను కూడా ఎత్తుకోవా.. అన్నట్టుగా అతని భుజం మీదకు ఎక్కి కూర్చుంది. ఎంతసేపైనా అతని భుజం దిగదు. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవుకుంటున్నారు. వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ ఆ కోతి కూడా డ్యాన్స్ చేయాలనుకుంటుంది’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘నన్ను కూడా ఎత్తుకో..’ అంటూ ఈ కోతి వచ్చిందని రాసుకొచ్చాడు. కాగా ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

