Teacher Dance: క్లాస్ రూమ్‌లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టిన టీచరమ్మ..!ట్రెండ్ అవుతున్న వీడియో..
ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ వైరలవుతుంటాయి. ఇక క్లాస్ రూంలో జరిగిన డాన్స్ వీడియోలైతే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని తెగ వైరలవుతుంటాయి. ఇక క్లాస్ రూంలో జరిగిన డాన్స్ వీడియోలైతే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్లోరిడా తరగతి గదికి సంబంధించిన వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేశారు. ఫ్లోరిడాలోని సమ్మర్ హై స్కూల్ విద్యార్థులు సెలబ్రేషన్లలో మునిగిపోయారు. ఇందులో భాగంగా ఓ పిల్లవాడు క్లాస్ రూమ్‌లో తన గురువులతోపాటు స్టెప్పులతో ఆదరగొడుతున్నాడు. అదే సమయంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను కూడా డాన్స్ చేయమని సవాలు చేశారు. దీంతో ముందుకొచ్చిన ఓ టీచర్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీచర్లు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. కానీ సదరు మహిళా టీచర్ చేసిన డాన్స్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ డాన్స్ పోటీ అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్నో డాన్స్ వీడియోలు ఉన్నా.. ఈ వీడియో మాత్రం ఎంతో స్పెషల్ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos