Numerology: ఈ ఏడాది ‘అంకెలతో ప్రేమ లంకెలు’ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..? సంఖ్యాశాస్త్రం ఏం సూచిస్తోందంటే..

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? అవి విజయవంతం కాబోతున్నాయా లేక బెడిసి కొట్టబోతున్నాయా? సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నది తెలుసుకోవాలంటే..

Numerology: ఈ ఏడాది ‘అంకెలతో ప్రేమ లంకెలు’ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..? సంఖ్యాశాస్త్రం ఏం సూచిస్తోందంటే..
Numerology 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jan 07, 2023 | 5:30 AM

అంకెలతో ప్రేమ లంకెలు: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? అవి విజయవంతం కాబోతున్నాయా లేక బెడిసి కొట్టబోతున్నాయా? సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నది తెలుసుకోవాలంటే ముందుగా మీ సంఖ్య ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ పుట్టిన తేదీని కూడితే మీ సంఖ్య ఏమిటో తెలుస్తుంది. ఉదాహరణకు, మీరు 1995 ఫిబ్రవరి 4వ తేదీన జన్మించారనుకోండి. అప్పుడు మీ రాడికల్ సంఖ్య 3 అవుతుంది. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలపాలి. అప్పుడు మీ సంఖ్య ఏమిటో తెలుస్తుంది.

రాడికల్ సంఖ్య 1: ఒకటి వచ్చిందనుకోండి. మీ సంఖ్యకు నాయకుడు సూర్యుడు అవుతాడు. మీ సంఖ్యను బట్టి మీరు మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయి ఉంటారు. దృఢమైన నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. హుందాగా, దర్పంగా వ్యవహరిస్తారు. 2, 3, 9 సంఖ్యల వారితో వీరి ప్రేమలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మే నెల మధ్య ఒకటి నెంబర్ వ్యక్తులు చాలా చురుకుగా, చైతన్యవంతంగా ఉంటారు. ఆ సమయంలో వారి ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆ సమయంలోనే అవి పెళ్లికి కూడా దారితీస్తాయి.

రాడికల్ సంఖ్య 2: ఇక రెండో నంబర్ విషయానికి వస్తే, వీరి అధిపతి చంద్రుడు అవుతాడు. ఈ నంబరు వ్యక్తులు సాధారణంగా ఎవరినో ఒకరిని అనుసరిస్తారు. వీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. ఏదో ఒక కళలో బాగా రాణిస్తారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణాలు ఇవ్వటానికి అయినా సిద్ధపడతారు. వీరికి 1,3,9 సంఖ్యల వారితో చక్కని పొంతన కుదురుతుంది. సాధారణంగా వీరికి ఏప్రిల్, జూలై మధ్య ప్రేమలు ఫలించే అవకాశం ఉంది. పెళ్లికి దారి తీసే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

రాడికల్ సంఖ్య 3: మూడో నెంబర్‌కు అధిపతి గురువు. వీరిలో ఆధ్యాత్మిక భావాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఎవరినైనా ప్రేమిస్తే నిష్కల్మషమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. వీరికి తమ కుటుంబం కంటే వేరే ఏదీ ముఖ్యం కాదు. స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. సాధారణంగా వీరు 1,2,9 నంబర్ల వారితో ప్రేమలో పడతారు. ఒకసారి ఓ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత ఇక మనసు మార్చుకునే అవకాశమే ఉండదు. వీరు తమ ప్రేమలో విఫలం అయ్యే అవకాశం ఏ ఉండదు. ఇప్పటికే ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఫిబ్రవరి తరువాత వివాహం అయ్యే అవకాశం ఉంది.

రాడికల్ సంఖ్య 4: నాలుగో సంఖ్యకు అధిపతి రాహువు. తమ ప్రేమ విషయాన్ని ఒక పట్టాన బయట పెట్టరు. చివరి వరకు తమ ప్రేమను రహస్యంగానే ఉంచుతారు. ప్రేమ విషయంలో విప్లవ భావాలు కలిగి ఉంటారు. కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి. వీరు సాధారణంగా 5,7,8 నెంబర్ వారితో ప్రేమలో పడుతుంటారు. ఈ నెంబర్ల వారితో అయితేనే పొంతన బాగా కుదురుతుంది. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. సాధారణంగా వీరు తమకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో ప్రేమలో పడతారు. చివరి వరకు ప్రేమకు కట్టుబడి ఉంటారు. ఈ సంఖ్య వారు అతి త్వరలో ప్రేమలో పడి, ఈ సంవత్సరం చివరిలో పెళ్లి చేసుకునే సూచనలు ఉన్నాయి.

రాడికల్ సంఖ్య 5: ఐదో సంఖ్య అధిపతి బుధుడు. వీరు అన్ని విషయాల్లోనూ ముందు చూపుతో వ్యవహరిస్తారు. వీరితో ప్రేమ వ్యవహారం ఎంతో సరదాగా, ఆనందంగా ఉంటుంది. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. హాస్య సంభాషణకు వీరు పెట్టింది పేరు. వీరికి 1, 4, 6 సంఖ్యల వారితో బాగా పొంతన కుదురుతుంది. వీరిని ప్రేమించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అయితే, వీరు తమ మనసులోని ప్రేమను ఒక పట్టాన బయట పెట్టరు. వీరిది ఎక్కువగా మానసికమైన ప్రేమ. భౌతికంగా ప్రేమను వ్యక్తం చేయరు. సాధారణంగా ఆడంబరాలకు, విలాసాలకు దూరంగా ఉంటారు. వీరు ఫిబ్రవరి తరువాత ప్రేమలో పడే అవకాశం ఉంది.

రాడికల్ సంఖ్య 1: ఆరో సంఖ్య అధిపతి శుక్రుడు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. లౌక్యంగా మాట్లాడుతారు. ఏ విషయాన్ని అయినా తమ అనుకూలంగా మార్చుకోగలరు. ఆడంబరాల కోసం, విలాసాల కోసం బాగా ఖర్చు చేస్తారు. వీరి ప్రేమలో కొద్దిగా నాటకీయత ఉంటుంది. ప్రేమ అనేది వీరికి ఒక సామాజిక హోదా లాంటిది. వీరికి ప్రేమలోనూ, పెళ్ళిలోనూ బాగా నప్పే సంఖ్యలు 4, 5, 8. ఈ నంబర్ల వారితో వీరి ప్రేమలు ఫలించి పెళ్లికి దారితీస్తాయి. వీరితో జీవితం అన్యోన్యంగా సాగుతుంది. వీరు మే నెల తర్వాత ప్రేమ బంధం లో ఇరుక్కునే సూచనలు ఉన్నాయి.

రాడికల్ సంఖ్య 7: ఏడో సంఖ్య అధిపతి కేతువు. వీరు కొద్దిగా విలక్షణంగా కనిపిస్తారు. విలాసాలకు దూరంగా ఉంటారు. ఆడంబరాలను దగ్గరకు రానివ్వరు. నిరాడంబరంగా కనిపిస్తారు. వీరికి అపారమైన తెలివితేటలు, దూరదృష్టి ఉంటాయి. అంతా తనకు అనుకూలమైనప్పుడే ప్రేమలో పడతారు. వీరికి 1,2,9 నంబర్ల వారితో పొంతన బాగా కుదురుతుంది. వీరి ప్రేమలో నటనకు అవకాశం ఉండదు. ఒక పట్టాన ఎవరినీ ప్రేమించరు. ప్రేమిస్తే ఇక మనసు మారటం అంటూ ఉండదు. శృంగార విషయాల కంటే ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడానికి వీరు ప్రాధాన్యం ఇస్తారు. జూలై, నవంబర్ నెలల మధ్య ప్రేమలో పడటానికి అవకాశం ఉంది.

రాడికల్ సంఖ్య 8: ఎనిమిదో సంఖ్యకు శని అధిపతి. వీరికి తెలివితేటలు ఎక్కువ. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. వీరికి అహంకారం కూడా ఎక్కువే. వీరితో వ్యవహరించడం కొంచెం కష్టం. బాగా కష్టపడతారు. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని సాగిస్తారు. వీరిని ఇతరులు అంత తేలికగా అర్థం చేసుకోలేరు. వీరికి 1,2 నంబర్ల వారితో మాత్రమే పొంతన కుదురుతుంది. వీరి ప్రేమ కనీస పక్షం మూడు నాలుగు ఏళ్ళు కొనసాగుతుంది. జూలై, నెలల మధ్య వీరి ప్రేమ పెళ్లికి దారి తీసే అవకాశం ఉంది. సాధారణంగా ఒంటరితనానికి ఇష్టపడతారు. ప్రేమ భాగస్వామితో పార్కుల కంటే ఎక్కువగా ఏకాంత ప్రదేశాలకే వెళుతుంటారు.

రాడికల్ సంఖ్య 9: తొమ్మిదో సంఖ్యకు కుజుడు అధిపతి. ఈ నంబరు వ్యక్తులు దృఢంగా ఉంటారు. ప్రతి దానిలోనూ పరిపూర్ణత కోరుకుంటారు. కోపం ఎక్కువ. ఏ విషయంలోనూ ఒక పట్టాన రాజీపడరు. పట్టుదల అధికంగా ఉంటుంది. ప్రతి దాన్ని విచక్షణతో చూస్తుంటారు. వీరికి 1, 4, 5 నంబర్ల వారితో సరిపడుతుంది. వీరిని ప్రేమించిన వారు వీరితో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత పురోగతికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఆధిపత్య ధోరణి కారణంగానే ప్రేమలో పడటం జరుగుతుంది. అయితే, వీరు మంచి ప్రేమికులు, మంచి స్నేహితుడుగా గుర్తింపు పొందుతారు. వీరి ప్రేమ వ్యవహారాలు మే నెల తర్వాత నుంచి ఒక దారిలో పడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో