Sankranti 2023: పండుగ ఒక్కటే కానీ పద్ధతులు అనేకం.. అదే సంక్రాంతి.. దీని విశేషాలేమిటో తెలుసుకుందాం రండి..
సంక్రాంతి పండుగ అంటేనే కొత్త వెలుగులు. పండుగ రాకముందు నుంచే చిన్న పిల్లలు వీధివీధిలో గాలిపటాలతో అలరిస్తుంటారు. ఇక సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి..
సంక్రాంతి పండుగ అంటేనే కొత్త వెలుగులు. పండుగ రాకముందు నుంచే చిన్న పిల్లలు వీధివీధిలో గాలిపటాలతో అలరిస్తుంటారు. ఇంకా చెప్పుకోవాలంటే భారతదేశం అంటేనే పండుగల దేశం. ఇక్కడ ప్రతి రోజూ ఏదో ఒక పేరుతో పండుగలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ దాదాపుగా జనవరి నెలలోనే వస్తుంది. ప్రతి ఏటా సూర్యుడు వరుసగా 12 రాశులలోనూ సంచరిస్తాడు. ఈ క్రమంలోనే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజును మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అలాగే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి కూడా. మకర సంక్రాంతి రోజున పుణ్యనదులలో స్నానం చేసి నువ్వులు, బెల్లం, చెరకు, శెనగపప్పు, నువ్వుల లడ్డూ, బియ్యం, కూరగాయలు, పప్పులు దానం చేసే సంప్రదాయం కూడా ఉంది.
అయితే మన దేశంలో అనేక ఆచారాలు, సాంప్రదాయాలను పాటించే ప్రజలు ఉన్నారు. వీటిని కాపాడుకుంటూనే ఆయా ప్రజలు తమ తమ పండుగలను చేసుకుంటారు. ఇదే క్రమంలో మకర సంక్రాంతి పండుగను కూడా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆచారాలను పాటించే ప్రజలు.. వివిధ పేర్లతో జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో మకర సంక్రాంతిని లోహ్రీ అని అంటే మరి కొన్ని ప్రాంతాలలో దీనినే మాఘీ అంటారు. ఈ జనవరి 14న జరుపుకునే ఈ సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..