Cat In Dreams: కలలో పిల్లి కనిపించిందా.? మీ జీవితంలో ఏదో మిరాకిల్ జరగబోతున్నట్లే..
రాత్రి పడుకున్న సమయంలో నిత్యం మనకు ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే నిద్రలో వచ్చే కలలో నిజ జీవితంపై ఏమైనా ప్రభావం చూపుతుందా.. అంటే కచ్చితంగా చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. పువ్వులు మొదలు జంతువుల వరకు కలలో కనిపించే ఒక్కో వస్తువుకు ఒక్కో రకమైన...
రాత్రి పడుకున్న సమయంలో నిత్యం మనకు ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే నిద్రలో వచ్చే కలలో నిజ జీవితంపై ఏమైనా ప్రభావం చూపుతుందా.. అంటే కచ్చితంగా చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. పువ్వులు మొదలు జంతువుల వరకు కలలో కనిపించే ఒక్కో వస్తువుకు ఒక్కో రకమైన అర్థం ఉంటుంది. అయితే వీటిలో కొన్ని శుభాలకు సూచనలయితే, మరికొన్ని అశుభాలకు సూచనలు ఉంటాయి. అయితే కలలో పిల్లి కనిపిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* పిల్లిని లక్ష్మీదేవీ రూపంగా భావిస్తుంటారు. కలలో పిల్లి కనిపిస్తే భవిష్యత్తులో మీకు ఆదాయం బాగా పెరుగుతుందని అర్థం.
* అయితే కొన్ని సందర్భాల్లో పిల్లి అశుభానికి కూడా సూచనగా చెప్పొచ్చు. కలలో తెల్ల పిల్లిని చూస్తే మీరు డబ్బు కోల్పేయే అవకాశం ఉంటుందని కలల శాస్త్రం చెబుతోంది.
* ఒకవేళ మీకు కలలో ఏదైనా పిల్లిని కాపాడుతున్నట్లు కనిపిస్తే మీకు శుభప్రదమని చెప్పొచ్చు. భవిష్యత్తులో అదృష్టం కలిసి రావడమే కాకుండా అన్నింటిలో విజయాలు సాధిస్తారని అర్థం.
* ఇక విద్యార్థులకు కలలో పిల్లి కనిపిస్తే కష్టానికి ఫలితం లభిస్తుందని అర్థం. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉంటాయని కలల శాస్త్రం చెబుతోంది.
* కలలో రెండు పిల్లులు గొడవ పడుతున్నట్లు కనిపిస్తే నెగిటివ్ అంశంగా భావించాలి. రానున్న రోజుల్లో మీ సమీప బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు అర్థం.
* ఇక కలలో ఒకేలాంటి రెండు పిల్లులు కనిపిస్తే మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సక్యతతో లేరని అర్థం. ఇలాంటి కలలు వస్తే పక్కవారితో మాట్లాడే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు జ్యోతిష్య నిపుణులు చెప్పిన అంశాల ఆధారంగా పేర్కొన్నవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..