TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి పౌర్ణమి గరుడ సేవ రద్దు.. కారణం ఏంటంటే..

తిరుమల ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి ఆలయంలో అధ్యయనోత్సవాలు...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి పౌర్ణమి గరుడ సేవ రద్దు.. కారణం ఏంటంటే..
Ttd
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 05, 2023 | 9:26 AM

తిరుమల ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. శ్రీవారి ఆలయంలో 25 రోజులపాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ఈనెల 3వ తేదీ రాత్రి ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పౌర్ణమి గరుడసేవ ఉండదని అధికారులు తెలిపారు. కాగా.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం తిరుపతి రానున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి వెల్లడించారు. 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.

మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ నెల 2 నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే.. కేవలం దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే స్వామిని దర్శించుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. అయినప్పటి కొందరు భక్తులకు త్వరగా, మరికొందరికి ఐదు, ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో భక్తులు నిర్వహణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని భక్తులు గంటల తరబడి కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కనీస సౌకర్యాలు లేక.. ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం చూడండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు