Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ శత్రువులను అధిగమించాలనుకుంటే.. ఈ విషయాలను తప్పక పాటించాలంటున్న చాణక్య నీతి..

ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. అలాగే తక్కువగా అంచనా వేయకూడదు. శత్రువుల నుంచి మనకు హాని కలగకుండా ఉండడానికి, వారిని అధిగమించడానికి ఆచార్య చాణక్యుడు ఎటువంటి నీతి సూత్రాలను బోధించాడో తెలుసుకుందాం..

Chanakya Niti: మీ శత్రువులను అధిగమించాలనుకుంటే.. ఈ విషయాలను తప్పక పాటించాలంటున్న చాణక్య నీతి..
Chanakya Neeti
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 30, 2022 | 8:23 AM

ప్రతి వ్యక్తి తన జీవిత విజయం కోసం ఎంతగానో కష్టపడతాడు. కానీ విజయంతో పాటు చాలా మంది శత్రువులుగా కూడా స్వయంచాలకంగా మారతారు. విజయం సాధించిన తర్వాత దాదాపుగా అందరకీ ఈ పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి సందర్భాలను అధిగమించడానికి నీతి కౌటీల్యుడు, విష్ణుగుప్తుడిగా ప్రసిద్ధి పొందిన ఆచార్య చాణక్యుడు కొన్ని రకాల నీతి సూత్రాలను బోధించాడు. ఆచార్యచాణక్యుడి నీతి సూత్రాలు కాలంతో పనిలేకుండా అన్ని కాలాల వారికి ఉపకరించేలా ఉంటాయి. చాణక్యుడి ప్రకారం జీవిత విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు మీ శత్రువులను కూడా సమయానుకులంగా ఓడించే మార్గాలను అలవరచుకోవడం చాలా ముఖ్యం. చాణక్యుడు బోధించిన నీతి సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. అలాగే తక్కువగా అంచనా వేయకూడదు. శత్రువుల నుంచి మనకు హాని కలగకుండా ఉండడానికి, వారిని అధిగమించడానికి ఆచార్య చాణక్యుడు ఎటువంటి నీతి సూత్రాలను బోధించాడో తెలుసుకుందాం..

శత్రువులపై విజయం కోసం ఆచార్య చాణక్యుడు ఏమన్నాడంటే..? 

  1. చాణక్య నీతి బోధనల ప్రకారం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనిషి సానుకూలంగా, సమయానుకూలంగా ఆలోచించాలి. శత్రువు చేతుల్లో ఓటమిపాలైనా సహనం కోల్పోకూడదు. 
  2. చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి తన కోపాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. కోపం కారణంగా కొన్ని కొన్ని సందర్భాలలో వ్యక్తి  తన తెలివిని, విచక్షణను కోల్పోతాడు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి తన భవిష్యత్తుపై దుష్పభావాలను చూపే నిర్ణయాలను తీసుకునే ప్రమాదం ఉంది. 
  3. సంబంధబద్ధంగా కాకుండా అనాలోచితంగా తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల శత్రువుకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందుకే ప్రతి అంశాన్ని ప్రశాంత చిత్తంతో ఆలోచించి, అర్థం చేసుకుని, ఆపై ఏదైనా అడుగు వేయాలి.
  4. చాణక్య నీతి ప్రకారం, శత్రువును ఎప్పుడూ బలహీనంగా పరిగణించకూడదు. అతను మీ కంటే బలహీనుడైనప్పటికీ, అతను బలవంతుడే అని భావించాలి. అప్పుడే బలవంతుడిని ఓడించగలిగేలా అడుగులు వేయగలం. 
  5. ఇవి కూడా చదవండి
  6. శత్రువు మనకంటే శక్తిమంతుడైతే, కొన్ని సందర్భాలలో మనం అతనికి అనుకూలంగా నడుచుకోవాలి. బహిరంగ శత్రువుగా మెలుగుతూ ఉండడం వల్ల అతనికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్ల శత్రువులపై అక్కడికక్కడే కాకుండా సమయానుకూలంగా దాడి చేయాలి.

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..