Pandya Brothers and Yash: రాకీ భాయ్‌ని కలిసి సందడి చేసిన పాండ్యా బ్రదర్స్.. వైరల్ అవుతున్న ఫొటోలు..
కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్‌ను భారత క్రికెటర్స్ అయిన పాండ్యా బ్రదర్స్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా ప్టాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు.
Updated on: Dec 29, 2022 | 9:31 PM

కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్‌ను భారత క్రికెటర్స్ అయిన పాండ్యా బ్రదర్స్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా ప్టాట్‌ఫామ్‌లో షేర్ చేశాడు.

కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలను చేయకుండా తన కుటుంబంతో గడుపుతున్నాడు. ‘కేజీఎఫ్ 3’ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఎవరూ ఊహించని రీతిలో అనూహ్యంగా రాకింగ్ స్టార్ యష్‌ను పాండ్యా బ్రదర్స్ కలుసుకున్నారు. ఆ సందర్భంగా వారు దిగిన ఫొటోలను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు ‘కేజీఎఫ్ 3’ అనే కాప్షన్ కూడా రాశాడు హార్దిక్.

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ‘కేజీఎఫ్’ సినిమాల ప్రదర్శనలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్ 2’ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా హాజరయ్యారు.

మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌తోకూడా కన్నడ నటుడు యష్ భేటీ అయ్యాడు.