Most Downloaded Apps 2022: భారత్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ ఇవే.. మీ ఫోన్‌లో కూడా ఇవి ఉన్నాయా..?
యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ టు మనీకంట్రోల్ నివేదిక ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి 2022 సంవత్సరంలో డౌన్‌లోడ్ చేసిన యాప్‌ల జాబితాలో కొన్ని యాప్‌లు మాత్రమే భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
Updated on: Dec 29, 2022 | 9:33 PM

భారత్‌లో 2022 సంవత్సరం అధికంగా డౌన్‌లోన్ చేసిన యాప్‌ల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ల వివరాలను మనం ఈ జాబితా ద్వారా తెలుసుకోవచ్చు. ఉన్నాయి. యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ టు మనీకంట్రోల్ ప్రకారం కొన్ని యాప్‌లు మాత్రమే ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వాటి వివరాలేమిటో తెలుసుకుందాం..

Instagram: 2022లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్‌ల జాబితాలో మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంవత్సరం 118.9 మిలియన్ల మంది ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

Whatsapp Business: ఈ సంవత్సరం గణనీయమైన అట్రాక్షన్‌ను సాధించిన వాట్సాప్ బిజనెస్ యాప్ 108.5 మిలియన్ల ఆండ్రాయిడ్ యాప్ ఇన్‌స్టాల్స్ పొందింది.

Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్‌ల జాబితాలో అగ్రశ్రేణిలో ఉంది. 2022 సంవత్సరం దాదాపు 156.5 మిలియన్ల ఇన్‌స్టాల్స్ జరిగాయి.

Meesho: ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్థి యాప్, ఈ కామర్స్ దిగ్గజం మీషో కూడా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్‌ల జాబితాలో నిలిచింది. 2022 సంవత్సరంలో ఈ యాప్ 186.7 మిలియన్ల ఇన్‌స్టాల్‌లను పొందింది.





























