- Telugu News Photo Gallery Former RCB players who are now a part of Mumbai Indians going to play Crucial Role in IPL 2023
IPL 2023: ఆర్‌సీబీ మాజీ ఆటగాళ్లే ఇప్పుడు ముంబై జట్టుకు బలం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం రండి..
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం సర్వం సిద్ధంగా ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం ద్వారా కొత్త ప్లేయర్లను పొందిన ఫ్రాంచైజీలు, వాటి జట్లు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లేదా ఆర్‌సీబీ తరఫున ఆడిన ఆటగాళ్లు ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కోసం ప్రధాన బాధ్యతలు వహించబోతున్నారు. మరి ముంబైలో ఉన్న ఆర్‌సీబీ మాజీలు ఎవరో తెలుసుకుందాం..
Updated on: Dec 29, 2022 | 9:57 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం సర్వం సిద్ధంగా ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం ద్వారా కొత్త ప్లేయర్లను పొందిన ఫ్రాంచైజీలు, వాటి జట్లు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లేదా ఆర్‌సీబీ తరఫున ఆడిన ఆటగాళ్లు ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కోసం ప్రధాన బాధ్యతలు వహించబోతున్నారు. మరి ముంబైలో ఉన్న ఆర్‌సీబీ మాజీలు ఎవరో తెలుసుకుందాం..

మార్క్ బౌచర్: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్ ఐపీఎల్ 2023 టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. 2008-2009లో RCB తరపున 27 మ్యాచ్‌లు ఆడిన బౌచర్ 388 పరుగులు చేశాడు.

జహీర్ ఖాన్: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా ఆర్‌సీబీ మాజీ ఆటగాడే. 2008, 2011-2013 మధ్య కాలంలో ఆర్‌సీబీ తరఫున 44 మ్యాచ్‌లు ఆడిన జహీర్ ఖాన్ 49 వికెట్లను పడగొట్టాడు. ఇక రానున్న ఐపీఎల్ టోర్నీలో ఈ టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ ముంబై ఇండియన్స్ క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

వినయ్ కుమార్: కర్ణాటక మాజీ పేసర్ వినయ్ కుమార్ ఇప్పుడు ముంబై ఫ్రాంచైజీ టాలెంట్ స్కౌట్ అండ్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందు ఆర్సీబీ తరఫున 64 మ్యాచ్‌లు ఆడిన వినయ్ మొత్తం 72 వికెట్లు పడగొట్టడం విశేషం.

పార్థివ్ పటేల్: ఆర్‌సీబీ తరపున 32 మ్యాచ్‌లు ఆడిన పార్థివ్ పటేల్ ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీకి టాలెంట్ స్కౌట్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అరుణ్ కుమార్ జగదీష్: 2008లో ఆర్‌సీబీ తరపున 3 మ్యాచ్‌లు ఆడిన అరుణ్ కుమార్ జగదీష్ ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.





























