Sankranti 2023: ఈ ఏడాది సంక్రాంతిని జనవరి 14 లేదా 15న ఎప్పుడు జరుపుకుంటారు? శుభ సమయం, పూజ విధానం మీకోసం

మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది..  పగల సమయం ఎక్కువ అవుతుంది. ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం.

Sankranti 2023: ఈ ఏడాది సంక్రాంతిని జనవరి 14 లేదా 15న ఎప్పుడు జరుపుకుంటారు? శుభ సమయం, పూజ విధానం మీకోసం
Makara Sankranthi 2023
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Dec 30, 2022 | 6:45 AM

హిందువుల పండగల్లో అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకునే పండగను జనవరి 2023లో జరుపుకోవడానికి అందరూ రెడీ అవుతున్నారు. మకర సంక్రాంతి పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ప్రతి నెలా రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు మకరరాశిలో సంచరించడాన్ని మకర సంక్రాంతి అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మకర సంక్రాంతిని అనేక పేర్లతో పిలుస్తారు. లోహ్రీ, బిహు, పొంగల్‌, సంక్రాంతి గా రకరకాల పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతి నాడు స్నానం, దానం, పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఒక నెల పాటు కొనసాగే ఖర్మ కాలం ముగిసి.. వివాహాది శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి.

మకర సంక్రాంతి ప్రాముఖ్యత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. మత విశ్వాసాల ప్రకారం.. మకర సంక్రాంతి రోజున దేవతలు భూమిపైకి వస్తారని విశ్వాసం. మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వులు, బెల్లం, బియ్యం, బట్టలు దానం చేయడం గంగాస్నానం చేసి సూర్యభగవానుని ఆరాధించడం ఉత్తమమని హిందువుల నమ్మకం. నువ్వులను దానం చేయడం ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది..  పగల సమయం ఎక్కువ అవుతుంది. ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. భీష్మ పితామహుడు సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో తన ప్రాణాలను అర్పించాడు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పని సామర్థ్యం పెరుగుతుంది. మకర సంక్రాంతి రోజున చేసిన దానం ఆ వ్యక్తికీ ప్రతి ఫల రూపంలో వందరెట్లు తిరిగి వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యదేవుడు తన కుమారుడైన శనీశ్వరుడి రాశి.. మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

2023 మకర సంక్రాంతి శుభ సమయం  హిందూ క్యాలెండర్ ప్రకారం.. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది  సూర్యుడు జనవరి 14వ తేదీ రాత్రి 08.20 నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశించి ధనుస్సు రాశిలో తన ప్రయాణాన్ని నిలిపివేస్తాడు. 2023వ సంవత్సరంలో మకర సంక్రాంతి శుభ ముహూర్తం జనవరి 15న ఉదయం 06.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 05.41 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈసారి మకర సంక్రాంతిని ఉదయ తిథి ప్రకారం జనవరి 15 న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి లోని మొదటి పండగ భోగి జనవరి 14వ తేదీన.. మూడో రోజున కనుమ పండగను జనవరి 16వ తేదీన జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మకర సంక్రాంతి పూజా విధానం మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. దక్షిణాయనం రాక్షసుల రోజు అయితే ఉత్తరాయణం దేవతల రోజు. మకర సంక్రాంతి నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి.. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. దీనితో పాటు సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తారు. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేయలేకపోయిన వారు తాము స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఈ రోజు నువ్వులను దానం చేయాలి. అంతే కాకుండా ఈ రోజు పరమాన్నం చేయడం తినడం పెద్దలను స్మరించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!