AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Horoscope 2023: ఈ రాశివారిపై కొత్త ఏడాదిలో శని ప్రభావం.. రాజకీయ నేతలకు అనేక సమస్యలు.. ఏడాదిలో ఎలాంటి పరిస్థితులుంటాయంటే..

బృహస్పతి ఏప్రిల్ 22 న అదృష్ట ఇంటిని విడిచిపెడతాడు. పదవ ఇంట్లో బృహస్పతి సంచారం  రాహువుతో కలయిక ఏర్పడనుంది. దీంతో గురు-చండాల యోగం ఏర్పడనుంది. దీని వల్ల కర్కాటక రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన రాజకీయ రంగాలోని వారికి ఇబ్బందులు పెరుగుతాయి.

Cancer Horoscope 2023: ఈ రాశివారిపై కొత్త ఏడాదిలో శని ప్రభావం.. రాజకీయ నేతలకు అనేక సమస్యలు.. ఏడాదిలో ఎలాంటి పరిస్థితులుంటాయంటే..
Horoscope 2023
Surya Kala
|

Updated on: Dec 29, 2022 | 8:04 PM

Share

2023 సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యమైన.. భారీ మార్పులను తీసుకురాబోతోంది. గ్రహ సంచారాలు ఏడాది పొడవునా వివిధ దశల్లో  ఈ రాశివారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కర్కాటక రాశి వారు 2023 సంవత్సరంలో చాలా హెచ్చు తగ్గులు చూస్తారు. సంవత్సరం ప్రారంభంలో  శనీశ్వరుడు ఈ రాశివారి ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ప్రభావం వల్ల ఈ రాశి వారు అనేక రకాల మానసిక, వృత్తి సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో.. ఈ రాశివారు డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాదు.. శుభ గ్రహంగా పరిగణించబడే దేవగురువు బృహస్పతి ఏప్రిల్ 22 న అదృష్ట ఇంటిని విడిచిపెడతాడు. పదవ ఇంట్లో బృహస్పతి సంచారం  రాహువుతో కలయిక ఏర్పడనుంది. దీంతో గురు-చండాల యోగం ఏర్పడనుంది. దీని వల్ల కర్కాటక రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన రాజకీయ రంగాలోని వారికి ఇబ్బందులు పెరుగుతాయి. అక్టోబర్ 30 న.. రాహువు..  ఈ రాశి అదృష్ట ఇంటి నుండి శక్తి ఇంటికి వెళతాడు. ఈ సంచారంతో గురు-చండాల దోషం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. సంవత్సరాంతంలో కర్కాటక రాశి వారికి ఇల్లు, భూమి, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్కాటక రాశి వారికి 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

జనవరి– సంవత్సరం ప్రారంభంలో ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్ధిక పురోగతి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అయినప్పటికీ మానసిక ఒత్తిడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి– ఈ రాశివారు ఈ నెలలో మంచి విజయాన్ని పొందుతారు. శత్రువులు ఓడిపోతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం లభిస్తుంది. అయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి.

మార్చి– 2023 సంవత్సరం ఈ నెలలో విద్యార్థులు విద్య-పోటీలలో విజయం సాధిస్తారు. విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మంచి  అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో గోప్యంగా ఉండండి. లేదంటే నష్టం జరగవచ్చు.

ఏప్రిల్– సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఈ రాశివారు మంచి ఆదాయాన్ని పొందుతారు. అయితే ఈ నెలలో కొంత బాధాకరమైన ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. శుభం కలుగుతుంది.

మే- 2023 సంవత్సరం ఉద్యోగస్తులకు శుభప్రదంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆయా రంగంలోని వారితో పాటు.. వ్యాపారంలో పురోగతికి మంచి అవకాశాలను పొందుతారు. ఆకస్మిక డబ్బు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలను పొందుతారు.

జూన్– జూన్ నెల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన చర్చలో విజయం సాధిస్తారు. ధనలాభానికి మంచి అవకాశాలు ఉంటాయి. భూమి-ఆస్తి సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి. ఈ రాశివారు గృహ-వాహనం కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ నెల అనుకూలంగా ఉంటుంది.

జూలై– ఈ నెలలో ఈ రాశివారికి గ్రహాల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఆనందం, కీర్తితో నిండిన జీవితం గడుపుతారు. విలాస వస్తువులపై ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఆగష్టు– ఈ నెలలో ఈ రాశివారికి ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అదృష్టం కలిసి వచ్చి.. సంపద, గౌరవం పెరుగుతుంది.

సెప్టెంబర్ – ఈ నెల ఉద్యోగం, వ్యాపార పరంగా చాలా శుభప్రదంగా.. లాభదాయకంగా ఉంటుంది. పని-వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు.

అక్టోబర్ – ఈ నెలలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ నెలలో మంచి విజయాలు సాధిస్తారు. నెలలో ప్రయాణం సాధ్యమవుతుంది. పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో మంచి బంధం ఏర్పడుతుంది. ఆనందం, శాంతి నెలకొంటుంది.

నవంబర్– ఈ నెలలో ఈ రాశివారు కొన్ని కుటుంబ కలహాలు..  మానసిక ఆందోళనలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాధాకరమైన వార్తలు వినాల్సి రావచ్చు. ఈ రాశివారు ఈ నెలలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.

డిసెంబర్ – 2023 సంవత్సరం చివరి నెల ఈ రాశివారికి మంచి విజయాన్ని అందించగలదు. ధన లాభం పొందవచ్చు. వివాహ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)