Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gemini Yearly Horoscope 2023: కొత్త ఏడాది మిథున రాశివారికి లక్కీ ఇయర్.. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

బృహస్పతి తన మీన రాశి నుంచి  మేషరాశిలోకి లాభ స్థానంలో అడుగు పెట్టనున్నాడు. దీంతో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది.  అంతే కాదు.. అక్టోబర్ నెలలో రాహువు సంచారం వలన ఈ రాశివారు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి సక్సెస్ అందుకుంటారు.

Gemini Yearly Horoscope 2023: కొత్త ఏడాది మిథున రాశివారికి లక్కీ ఇయర్.. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
Gemini Horoscope 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2022 | 7:30 PM

2023 సంవత్సరం మిధున రాశి వారికి శుభప్రదం.. ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఏడాది పొడవునా మంచి విజయాలు లభించే సూచనలు ఉన్నాయి. 2023లో మిథు రాశి వారికి శని దృష్టి నుండి విముక్తి కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. జనవరి 17, 2023 న శని.. మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే..  మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.

అంతేకాదు 2023 సంవత్సరంలో రెండవ ప్రధాన రాశి బృహస్పతి తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ నేపథ్యంలో బృహస్పతి తన మీన రాశి నుంచి  మేషరాశిలోకి లాభ స్థానంలో అడుగు పెట్టనున్నాడు. దీంతో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది.  అంతే కాదు.. అక్టోబర్ నెలలో రాహువు సంచారం వలన ఈ రాశివారు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి సక్సెస్ అందుకుంటారు. అకస్మాత్తుగా అధికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. 2023 సంవత్సరంలో అంగారకుడు, బుధుడు, సూర్యుడు, శుక్ర గ్రహాల సంచారం ఈ రాశివారికి మంచిది. ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

జనవరి -2023 ప్రారంభంలో, బుధుడు ఈ రాశివారు 7వ ఇంటిలో, శని మీ 8వ ఇంటిలో.. బృహస్పతి మీ 10వ ఇంటిలో సంచరిస్తారు. సంవత్సరం ప్రారంభంలో వీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాహ సంబంధిత కార్యక్రమాల ప్రయత్నాలు చేపట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి– చాలా సంవత్సరాలుగా కోర్టులో   కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలు ఈ ఏడాది తెరపడే అవకాశం ఉంది. కోర్టులో తీర్పు మీకు  అనుకూలంగా రావచ్చు, ధనలాభ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ పరంగా ఈ నెల బాగానే ఉంటుంది. అధికారుల సహకారం లభిస్తుంది.

మార్చి– మార్చి నెల కెరీర్ పరంగా బాగుంటుంది. మరోవైపు భూమి, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలో పరిష్కారమవుతాయి. కుటుంబంలో కొన్ని మతపరమైన సంఘటనలు ఉండవచ్చు.

ఏప్రిల్– ఏదైనా వ్యాపారంలో పని చేసే వారికి ఏప్రిల్ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ నెలలో ఎవరికైనా అప్పు ఇవ్వకండి. కష్టపడి పని చేసిన వారికి అదృష్టం మీ వెంట ఉంటుంది. ఈ నెలలో ఉద్యోగ అన్వేషణ సక్సెస్ అవుతుంది.

మే– మిథున రాశి వారికి మే నెల ఆదాయం పరంగా బాగుంటుంది. ఈ రాశివారు ఒకేసారి అనేక రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. నిలిచిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తారు. పెట్టుబడి పరంగా ఈ నెల బాగుంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

జూన్– ఈ నెలలో ఈ రాశివారు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. కానీ ఆర్థికంగా నష్టపోవచ్చు, దీని వల్ల మీరు నిరాశ చెందుతారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు మంచి పెద్ద పదవులు పొందగలరు.

జూలై- ఈ నెలలో కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పనుల్లో ఆటంకాలు ఏర్పడటం వల్ల పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు  ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. నెలంతా హడావుడి నెలకొంటుంది.

ఆగస్ట్ – ఈ నెలలో ఈ రాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగ నిపుణులు ఆఫీసులో మరింత కష్టపడాల్సి రావచ్చు, దీని కారణంగా మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల పరంగా ఈ నెల బాగుంటుంది.

సెప్టెంబర్– ఈ నెలలో మిథున రాశి వారు పూర్వీకుల ఆస్తుల నుండి ప్రయోజనం పొందవచ్చు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వీరికి శుభం కలుగుతుంది.

అక్టోబర్ – ఈ నెలలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు వారి కొన్ని ప్రణాళికల్లో నష్టాలను చవిచూడవలసి ఉంటుంది.

నవంబర్– అక్టోబర్‌తో పోలిస్తే, నవంబర్ నెలలో మీకు అనేక రకాల శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో రాహువు తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ మార్పు మీకు మేలు చేస్తుంది. ధనలాభానికి అనేక అవకాశాలు ఉంటాయి.

డిసెంబర్ – 2023 సంవత్సరం చివరి నెలలో.. ఈ రాశివారు ఉద్యోగంలో శుభవార్త పొందవచ్చు. ఉద్యోగం మారే విషయంలో ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తారు.

అదృష్ట సంఖ్య – 5..  అదృష్ట తేదీలు – 5, 14 , 23 ,, అదృష్ట నెలలు – మే, జూన్ , సెప్టెంబర్..  లక్కీ డేస్ – బుధ, శుక్రవారం, ఆదివారం..  అదృష్ట రత్నాలు – పచ్చ, వజ్రం , రూబీ

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)