Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు షాక్.. ఆ వసతి గృహాల్లో భారీగా పెరిగిన అద్దెలు..

తిరుమల వెళ్తున్నారా.. గతంలో రూ.50, రూ.100లకే గదులను అద్దెకు తీసుకున్నారా.. ఇప్పుడు కూడా అంతే ఉంటుదనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడినట్లే.. గతంతో పోలిస్తే కొన్ని వసతి గృహల్లో అద్దెలు భారీగా పెరిగాయి. ఆధునికీకరణ చేసి.. వసతి గృహల్లో భక్తులకు కొన్ని సౌకర్యాలను..

Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు షాక్.. ఆ వసతి గృహాల్లో భారీగా పెరిగిన అద్దెలు..
Tirumala
Follow us

|

Updated on: Jan 07, 2023 | 4:29 AM

తిరుమల వెళ్తున్నారా.. గతంలో రూ.50, రూ.100లకే గదులను అద్దెకు తీసుకున్నారా.. ఇప్పుడు కూడా అంతే ఉంటుదనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడినట్లే.. గతంతో పోలిస్తే కొన్ని వసతి గృహల్లో అద్దెలు భారీగా పెరిగాయి. ఆధునికీకరణ చేసి.. వసతి గృహల్లో భక్తులకు కొన్ని సౌకర్యాలను కల్పించిన టీటీడీ అద్దె ధరలు భారీగా పెంచి.. భక్తులకు షాకిచ్చింది. తిరుమలలో అన్ని పాత వసతి గృహలను ఆధునీకరించేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు రూ.110 కోట్లతో టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టారు. ఏసీ, గీజర్‌ వంటి సదుపాయాలు కల్పించి వాటి అద్దెలను పెంచారు. తిరుమలలో సుమారు 6000 గదులు ఉన్నాయి. ఇప్పటికే తిరుమలలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్‌హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్‌టైప్‌ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతోపాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరలపై సామాన్య భక్తులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని గదుల ధరల విషయంలో పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఈ నెల 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయనుంది. ఇప్పటికే ఈనెల 1 నుంచి 11వ తేదీ వరకు దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీచేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..