Nagababu Comments On Roja: బాధ్యతలు మర్చిపోకు.. ర్యాంకు దిగజారిపోతుంది.. మంత్రి రోజాకు నాగబాబు కౌంటర్
Nagababu Comments On Roja: మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు నటుడు నాగబాబు కౌంటరిచ్చారు. మంత్రిగా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. రోజా.. బారతదేశపు రాష్ట్రాల పర్యాటక స్థానాల ర్యాంకింగ్‌లో..
Nagababu Comments On Roja: మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ ఇటీవల ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు నటుడు నాగబాబు కౌంటరిచ్చారు. మంత్రిగా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. రోజా.. బారతదేశపు రాష్ట్రాల పర్యాటక స్థానాల ర్యాంకింగ్‌లో 20 ప్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ ఉన్నాయన్నారు. బాధ్యతలు మర్చిపోయి నోటికొచ్చినట్లు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో పదవి దిగిపోయే లోగా రాష్ట్రాన్ని 20వ స్థానానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని విమర్శించారు నాగబాబు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖపై ఆధారపడి వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీరి జీవితాలు మట్టికొట్టుకుపోయాయని, పిచ్చపిచ్చగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరీ దిగజారిపోతుందన్నారు. ముందు పర్యాటక శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు నువ్వు తెలుసుకోవాలని సూచించారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, పర్యాటక శాఖను ఎలా అభివవృద్ధి చేయాలో తెలుసుకోవాలని హితవు పలికారు. రోజా ఇన్ని రోజులు చిరు, పవన్ కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడినా తాను రియాక్ట్ అవ్వలేదంటే ఒకటే ఒక కారణమని, రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదన్నారు. చూస్తా చూస్తా ఎవరూ మున్సిపాల్టీ కుప్పతొట్టిని గెలకరని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ మంత్రి రోజాపై నాగబాబు ఫైర్ అయ్యారు.
అసలు విషయానికొస్తే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా నాగబాబు సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై అనేకసార్లు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. తాజాగా రోజా ఏకంగా మెగా ఫ్యామిలీలోని చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడని.. ఆయన తప్పులు చేసి ఇరుక్కున్న సమయంలో ఆయనకు మద్దతుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాడని రోజా ధ్వజమెత్తారు. దీన్ని బట్టి ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతోందని దుయ్యబట్టారు.ఇప్పటంలో గోడలకు ఉన్న విలువ.. కందుకూరులో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని రోజా ఆరోపించిన విషయం తెలిసిందే.
రోజా @RojaSelvamaniRK నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..