Deliotte Centre: భువనేశ్వర్‌లో డెలాయిట్ కెపాసిటీ ఎన్‌హాన్స్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ICOMC టవర్‌లో కన్సల్టింగ్ మేజర్ డెలాయిట్ కెపాసిటీ ఎన్‌హాన్స్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిసి..
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ICOMC టవర్‌లో కన్సల్టింగ్ మేజర్ డెలాయిట్ కెపాసిటీ ఎన్‌హాన్స్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్‌ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో తూర్పు భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఇలాంటి కంపెనీ ప్రారంభించడం జరిగిందని, ఒడిశాలోని ప్రతిభావంతులకు ఇది గొప్ప అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి.
ఇక ఈ డెలాయిట్ సెంటర్ ఒడిశా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వృద్ధిని మరింత పెంచనుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా రాష్ట్ర యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంది. డెలాయిట్ దేశ వ్యాప్తంగా విస్తరించే లక్ష్యంగా భాగంగా.. భువనేశ్వర్‌లోనూ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆడిటింగ్, కన్సల్టెన్సీ, నాలెడ్జ్ సర్వీసెస్ మొదలైన వాటి నుండి వివిధ స్థానాల్లో వెయ్యి మంది కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. భువనేశ్వర్‌లో డెలాయిట్ సెంటర్‌ను ప్రారంభించడం వల్ల ప్రపంచ స్థాయి సంస్థలకు ఒడిశా ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ షేర్ చేసిన ట్వీట్ ఇదే..
A momentous day for Odisha.
Sharing some glimpses of the inauguration of @Deloitte’s Capability Enhancement Centre in Bhubaneswar. A first-of-its-kind initiative in eastern India, this will open up new possibilities for the talented human capital of Odisha. @PIB_India pic.twitter.com/c8cINWSv6A
— Dharmendra Pradhan (@dpradhanbjp) January 6, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..