BJP vs Congress: ‘బట్టబయలైన రాహుల్‌ గాంధీ టీషర్ట్ సీక్రెట్‌! పబ్లిసిటీ కోసం ఇంత దిగజారుడెందుకో..?’

డ్డకట్టుకుపోయే చలిలో కూడా రాహుల్‌ గాంధీ కేవలం టీ షర్ట్‌ మాత్రమే ధరించి జోడో యాత్రలో చురుకుగా పాల్గొనడంపై ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 52 ఏళ్ల వయసున్న రాహుల్‌ గాంధీ చలి గిలి లేకుండా

BJP vs Congress: 'బట్టబయలైన రాహుల్‌ గాంధీ టీషర్ట్ సీక్రెట్‌! పబ్లిసిటీ కోసం ఇంత దిగజారుడెందుకో..?'
Rahul Gandhi T Shirt Secrete
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2023 | 8:09 PM

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర భారత్‌లో గడ్డకట్టుకుపోయే చలిలో కూడా రాహుల్‌ గాంధీ కేవలం టీ షర్ట్‌ మాత్రమే ధరించి జోడో యాత్రలో చురుకుగా పాల్గొనడంపై ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 52 ఏళ్ల వయసున్న రాహుల్‌ గాంధీ చలి గిలి లేకుండా కార్యకర్తలతో కలిసి తిరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐతే తాజాగా రాహుల్‌ గాంధీ ధరించిన టీషర్ట్‌కు సంబంధించిన ఓ క్లోజ్అప్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రాహుల్‌ టీ షర్ట్‌లోపల ‘థర్మల్’ ధరించాడని ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా కీలక వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్‌ చేశాడు కూడా. ‘సంచిలో దాగున్న పిల్లి బయటపడింది! స్లీవ్‌లెస్ థర్మల్, నిండా బటన్లు పెట్టిన టీ షర్ట్‌తో అందరినీ మెసం చేస్తున్న రాహుల్ గాంధీ నకిలీ కథనం బట్టబయలు. చలికాలంలో చలి అనిపించడం సహజమే! ఇది ఫేక్ పబ్లిసిటీ కోసం అటెన్షన్ సీకింగ్ జిమ్మిక్ తప్ప మరొకటి కాదు’ అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

బీజేపీ నేత ట్వీట్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘రాహుల్‌ గాంధీ టీషర్ట్‌, అతని మెడ, ఛాతి భాగాలను జూమ్‌ చేసి మరీ స్క్రీన్‌షాట్‌ తీశారు. కానీ ఇవన్నీ నిరాశపరచేవిగా ఉన్నాయని’ ట్విట్‌ చేశారు. రాహుల్‌ను కొందరు చుట్టుముట్టి కౌగిలించుకున్నట్లు ఉన్న కార్టూన్‌ చిత్రాన్ని ట్వీట్‌ చేస్తూ.. దేశ ప్రజలకు మేము రుణపడి ఉంటాం. వారి ప్రేమ వెచ్చదనం రాహుల్‌జీ టీ షర్ట్‌లోనికి చలి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని’ అన్నారు. ఇక గతవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ శీతాకాలంలో చలి లేకుండా ఎలా నడుస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. రాహుల్‌ సత్య కవచాన్ని ధరించడమే అందుకు కారణం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.