- Telugu News Photo Gallery Prime Minister Narendra Modi will on January 13 flag off the 51 day luxury Ganga cruise from Varanasi to Dibrugarh
MV Ganga Vilas: ‘ఎంవీ గంగా విలాస్’.. దీని ప్రత్యేకతలివే.. త్వరలోనే ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
51 రోజులలో 27 నదీ వ్యవస్థల మీదుగా మొత్తం 3200 కి.మీ దూరం సాగే తన మొదటి పర్యటనను ఈ శుక్రవారం ప్రారంభించనున్న గంగా క్రూయిజ్ బంగాళాఖాతం డెల్టాలోని సుందర్‌బన్స్, అలాగే కజిరంగా నేషనల్ పార్క్ గుండా కూడా ప్రయాణిస్తుంది. ఇంకా దీని ప్రత్యేకతలేమిటంటే..
Updated on: Jan 09, 2023 | 7:29 AM

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం ప్రయాణించే రివర్ క్రూయిజ్ ‘ఎంవీ గంగా విలాస్’ను శుక్రవారం(జనవరి 13) వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

గంగా క్రూయిజ్ వారణాసిలోని గంగా నదిపై గంగా హారతితో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రూయిజ్ తన ప్రయాణంలో ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రమైన సారనాథ్, మయోంగ్, నదిలో నిర్మించిన మజులి అనే ద్వీపాన్ని మీదగా వెళ్లనుంది. ఈ క్రూయిజ్ తన మొదటి పర్యటనలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు ప్రయణించనున్నారు.

ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ అనే ఈ ఓడ భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ క్రమంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు సహా 50 పర్యాటక ప్రదేశాల సందర్శనలతో ఈ క్రూయిజ్ తన పర్యటనను సాగిస్తుంది.

కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. క్రూయిజ్ షిప్ బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి 50 ప్రధాన నగరాల మీదుగా వెళుతుంది. జనవరి 13న వారణాసిలో తన పర్యటనను ప్రారంభించనున్న గంగా క్రూయిజ్ ఫిబ్రవరి 1 నాటికి దిబ్రూఘర్ చేరుకొని తన ప్రయాణాన్ని ముగిస్తుంది.

దేశంలో ప్రస్తుతం వారణాసి, కోల్‌కతా మధ్య ఎనిమిది రివర్ క్రూయిజ్‌లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా రెండో జాతీయ జలమార్గం(బ్రహ్మపుత్ర నది)పై క్రూయిజ్ ట్రాఫిక్ కొనసాగుతుంది.

M1




