చలి తీవ్రతతో వారంలో 98 మంది మృతి.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ సర్కార్ హెచ్చరికలు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చలికి తట్టుకోలేక కేవలం వారం రోజుల్లో ఏకంగా 98 మంది మృతి చెందారు. ఇప్పటికే అనేక మంది ఆసుపత్రుల్లో..

చలి తీవ్రతతో వారంలో 98 మంది మృతి.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ సర్కార్ హెచ్చరికలు
Winter Deaths
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 09, 2023 | 7:48 AM

ఉత్తర భారతంలో చలి తీవ్రత ప్రమాద స్థాయిలో ఉంది. అక్కడ నానాటికీ విజృంభిస్తోన్న చలి దృష్ట్యా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాద హెచ్చరికలుకూడా జారీ చేశాయి. స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చలికి తట్టుకోలేక కేవలం వారం రోజుల్లో ఏకంగా 98 మంది మృతి చెందారు. ఇప్పటికే అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 44 మంది చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించగా, 54 మంది చికిత్సకు ముందే మరణించారు. శనివారం ఒక్కరోజే దాదాపు 14 మంది మరణించినట్లు ఎల్పీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ నవేదిక వెలువరించింది.

ఈ ప్రాంతంలో వరుస మరణాలు నమోదుకావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ చలికాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చలిలో ఒక్కసారిగా రక్తపోటు పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున 60ఏళ్లు పైబడిన వారు బయటికి వెళ్లవద్దని, మిగిలిన వయస్సులవారు సైతం అవసరం అయితేతప్ప బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..