Telangana: అత్యంత సురక్షిత జిల్లాగా నిలిచిన అదిలాబాద్.. ‘వ్యక్తిగత భద్రత సూచిక’లో ఐదో స్థానం.. పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా అగ్రస్థానం సాధించింది అదిలాబాద్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సామాజిక ప్రగతి సూచిక ఇటీవల విడుదల చేసిన ‘సురక్షితమైన జిల్లాల నివేదిక’లో అదిలాబాద్..

Telangana: అత్యంత సురక్షిత జిల్లాగా నిలిచిన అదిలాబాద్.. ‘వ్యక్తిగత భద్రత సూచిక’లో ఐదో స్థానం.. పూర్తి వివరాలివే..
Adilabad Tops Personal Safety Index In Telangana
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 09, 2023 | 8:03 AM

తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగానే కాక మావోయిస్టు  ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా ఎవరూ ఊహించని రీతిలో అత్యంత అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా అగ్రస్థానం సాధించింది అదిలాబాద్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సామాజిక ప్రగతి సూచిక ఇటీవల విడుదల చేసిన ‘సురక్షితమైన జిల్లాల నివేదిక’లో అదిలాబాద్ కూడా ఉంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. ‘వ్యక్తిగత భద్రత సూచిక’లో దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాల జాబితాలో ఐదో స్థానాన్ని అదిలాబాద్ దక్కించుకుంది. ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా ఈ భద్రత ర్యాంకింగ్స్ రావడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డికి ప్రముఖుల ద్వారా అభినందనలు వెల్లువెత్తాయి.

అయితే సామాజిక ప్రగతి సూచిక ప్రకారం..  వందకి 89.89 మార్కులు సాధించిన నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్‌ జిల్లా దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా మొదటి స్థానంలో నిలిచింది. 89.64 మార్కులతో గురుదాస్పూర్(పంజాబ్‌), 89.62 మార్కులతో సేనాపతి(మణిపూర్‌), 86 మార్కులతో ఫిరోజ్‌పూర్‌(పంజాబ్‌), 85 మార్కులతో ఆదిలాబాద్‌(తెలంగాణ) జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచాయి. ఆదిలాబాద్‌ తర్వాత 81 పాయింట్లతో కరీంనగర్‌ జిల్లా రాష్ట్రం నుంచి మెరుగైన స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర జాబితాలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా.. భద్రాద్రి (44), సిరిసిల్ల(47), సూర్యాపేట(48) అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
సామాజిక ప్రగతి సూచిక జరిపిన ఈ సర్వేలో 89 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా.. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, హత్యలు, రోడ్డు మరణాలు, హింసాత్మక నేరాలు తదితర అంశాలను వ్యక్తిగత భద్రత పరిమితిని లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకున్నారు. తెలంగాణ వ్యక్తిగత భద్రత స్కోరు 42గా ఉండగా ఆదిలాబాద్ జిల్లా స్కోరు 85గా ఉండి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..