Viral Video: చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనేమో.. ఆరు పదుల వయసులోనూ తగ్గేదే లే అంటున్న అంకుల్..
మన దేశంలో కొత్తగా వచ్చిన ఏ పాట అయినా కొంత కాలం పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్‌గా నెటిజన్లను అలరించడమనేది సర్వసాధారణంగా జరిగేదే. ఇక ఈ ట్రెండింగ్ పాటలకు యువత..
మన దేశంలో కొత్తగా వచ్చిన ఏ పాట అయినా కొంత కాలం పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్‌గా నెటిజన్లను అలరించడమనేది సర్వసాధారణంగా జరిగేదే. ఇక ఈ ట్రెండింగ్ పాటలకు యువత రీల్స్ చేయడం, తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం కూడా మామూలే. ఆ క్రమంలోనే ఆయేషా అనే పాకిస్థానీ అమ్మాయి ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ అనే పాటకు డ్యాన్స్ చేసి ఆ సాంగ్‌ను భారత్ సహా అనేక దేశాలలో వైరల్ చేసింది. ఇదే బాటలో ప్రస్తుతం ‘పత్లీ కమకియా మోరీ’ అనే భోజ్పూరీ పాట కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటకు అనేక మంది రీల్స్ చేసి ఫేమస్ అవుతున్నారు. అదే పాటకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడమే కాక నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎందుకంటే ఆ వీడియోలో పత్లీ కమరియా మోరీ పాటకు డ్యాన్స్ వేసింది అమ్మాయిలో, అబ్బాయిలో కానే కాదు. యువకులు అసలే కాదు. దాదాపు 50 సంవత్సరాలున్న ఒక అంకుల్ ఈ పాటకు తన నడుమును ఊపుతూ జెర్క్స్ ఇచ్చాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పత్లీ కమరియా మోరీ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, నలుగురు అమ్మాయిలతో కలిసి ఒక అబ్బాయి కిస్ చేస్తున్నట్లు సైగ చేయగా.. ఆ అంకుల్ తన జెర్క్స్‌ను చూయించడాన్ని మనం గమనించవచ్చు. చూడడానికి లుంగీ, షర్ట్ వేసుకున్న ఆ అంకుల్‌లోని యువకుడు ఇంకా మిగిలే ఉన్నాడనిపించేలా ఉన్న ఆయన ఊపులను చూసి అందరూ నవ్వేసుకుంటున్నారు కూడా.
వైరల్ అవుతున్న అంకుల్ స్టెప్పులను ఇక్కడ చూడండి..
View this post on Instagram
fasila.shameer అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 24 లక్షల వీక్షణలు వచ్చాయి. అలాగే 17 లక్షల 10 వేల లైకులను అందుకున్న ఈ వీడియోకు నెటిజన్లు వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘అదొక్కటే మిగిలింది’ అని ఫన్నీగా రాస్తే, ‘అంకుల్ సన్నటి నడుమును ఏ కోణం నుంచి చూస్తున్నారు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..