- Telugu News Photo Gallery You will be Wonder after knowing how sugarcane juice is good for your health and body
Sugarcane Juice: చెరకు రసం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారతదేశం ప్రపంచంలోనే రెండవస్థానంలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా పండే చెరకులో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇది 250 కేలరీలు, 30 గ్రాముల సహజ చక్కెరను కలిగి ఉంటుంది.
Updated on: Jan 09, 2023 | 9:32 AM

చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారతదేశం ప్రపంచంలోనే రెండవస్థానంలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా పండే చెరకులో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇది 250 కేలరీలు, 30 గ్రాముల సహజ చక్కెరను కలిగి ఉంటుంది. ఇక చెరుకు రసాన్ని తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన 6 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1. తక్షణ శక్తి మూలం: శరీరానికి తక్షణ శక్తి అందించగల వనరు చెరకు.అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చెరకు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. చెరకు మీ శరీరాన్ని శక్తివంతం చేయడమే కాకుండా వేడి లేదా చలి నుంచి కూడా రక్షిస్తుంది.

2. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది: చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల కాలేయం పనితీరును మెరుగుపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా చెరకు రసం సహాయపడుతుంది. కామెర్లు వంటి కాలేయ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ రసం తాగడమనేది ఉత్తమ మార్గం. ఆల్కలీన్ స్వభావం ఉన్నందున చెరకు రసం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి ఉపకరిస్తుంది.

3. కిడ్నీలను శుభ్రపరుస్తుంది: చెరకు రసం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. సహజంగానే ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇంకా సంతృప్త కొవ్వులతో పాటు తక్కువ సోడియం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా చెరకురసం కిడ్నీలను శుభ్రపరచడంలో ఉపకరిస్తుంది.

4. క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది: చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. చెరకురసంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్ వంటి పలు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చెరకు ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటాయి. వీటి సహాయంతో శరీరం క్యాన్సర్ కణాలతో పోరాడగలుగుతుంది. ఒక వ్యక్తి ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుంటే కచ్చితంగా అతనికి లేదా ఆమెకు చెరకు రసం అవసరం.

5. మొటిమలు, నోటి దుర్వాసన: మొటిమలు, నోటి దుర్వాసనను పోగొట్టడంలో చెరకు రసం ఎంతగానో ఉపకరిస్తుంది. చెరకు రసం మొటిమలతో సహా అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో గ్లైకోలిక్, ఆల్ఫా-హైడ్రాక్సీ (AHA) వంటి ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల ఇది కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు మొటిమలను తొలగించడంలో తోడ్పడుతాయి.

6. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది: చెరకు రసంలో కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చెరకు సహాయంతో పంటి ఎనామెల్, దంతాలు బలోపేతం అవుతాయి. చెరకు రసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇంకా కడుపులో పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు చెరకు రసాన్ని తీసుకోవచ్చు.





























